ETV Bharat / city

'రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డు రాని కరోనా.. చంద్రబాబు పర్యటనకు అడ్డొచ్చిందా?' - తెదేపా నేతలు

తిరుపతి విమానాశ్రయంలో అధినేత చంద్రబాబు నిర్భంధాన్ని తెదేపా నేతలు ఖండించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతను, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని నిర్బంధించడం ఏంటని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. చంద్రబాబును చూసి ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఎన్నికల్లో వైకాపా చేసిన అరాచకాలు, ఆకృత్యాలు బయటకు వస్తాయనే భయంతోనే అధినేతను అడ్డుకున్నారని పీతల సుజాత ధ్వజమెత్తారు.

tdp leaders
చంద్రబాబు నిర్బంధాన్ని ఖండించిన తెదేపా నేతలు
author img

By

Published : Mar 1, 2021, 12:40 PM IST

Updated : Mar 1, 2021, 2:26 PM IST

రేణిగుంటలో చంద్రబాబు నిర్బంధంపై తెదేపా నేతల ఆగ్రహం

రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవటాన్ని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, కాలవ శ్రీనివాసులు, గద్దె రామ్మోహన్, అమర్నాథ్ రెడ్డి, బండారు సత్యనారాయణ మూర్తి, బీటీ నాయుడు, జవహర్, తదితరులు ట్విట్టర్ ద్వారా చంద్రబాబు అరెస్టుపై ధ్వజమెత్తారు. రాజారెడ్డి రాజ్యాంగానికి తాజా పరిణామాలు పరాకాష్ఠ అని ఆక్షేపించారు. వైకాపా నాయకుల రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డురాని కరోనా.. చంద్రబాబు పర్యటనకు ఎలా అడ్డొచ్చిందని నిలదీశారు. తుగ్లక్ పాలనపై ప్రజలు తిరగపడతారనే విమానాశ్రయంలో తమ అధినేతను నిర్బంధించారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి భయం జగన్​ను ఇంకా వెంటాడుతోదని ధ్వజమెత్తారు.

ప్రధాన ప్రతిపక్ష నేతను అడ్డుకోవడం ఏంటి ?: యనమల

తెలుగుదేశం అధినేత చంద్రబాబును నిర్బంధించటం అప్రజాస్వామికమని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి జగన్మోహన్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని నిర్బంధించడం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనమని ఆక్షేపించారు. చంద్రబాబు పేరు వింటే జగన్మోహన్ రెడ్డి ఎంతలా భయపడుతున్నారనడానికి చిత్తూరు జిల్లా పర్యటనలో అడ్డుకోవడమే ఉదాహరణ అని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉందన్న యనమల.. ఇష్టానుసారంగా ఎక్కడబడితే అక్కడ నిర్బంధిచడం పౌర స్వేచ్ఛను హరించడమేనని ఆక్షేపించారు.

చంద్రబాబును చూసి ప్రభుత్వం భయపడుతోంది: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

తెదేపా అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూసి ప్రభుత్వం భయపడుతోందన్నారు. ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబును విమానాశ్రమంలో అడ్డుకోవడాన్ని కొల్లు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు రామతీర్థం వెళ్తున్న సమయంలో కూడా ఇలాగే వ్యవహరించారని.. గతంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో కూడా అడ్డుకున్నారని తెలిపారు. చంద్రబాబు అంటే ముఖ్యమంత్రి జగన్​కి ఎందుకు అంత భయమని నిలదీశారు. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారని ఆయన ఆరోపించారు.

ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం: మాజీ మంత్రి పీతల సుజాత

అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసమస్యలపై ఎప్పుడూ పోరాటం చేసే వ్యక్తి చంద్రబాబు అని.. అలాంటిది వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారని మరో మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. చిత్తూరులో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. వైకాపా ఎన్నికల్లో చేస్తున్న అరాచకాలు, అకృత్యాలు బయటకు వస్తాయనే భయంతో అడ్డుకున్నారని పీతల సుజాత ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

పోలీసుల తీరుకు నిరసనగా.. విమానాశ్రయంలో చంద్రబాబు బైఠాయింపు

Last Updated : Mar 1, 2021, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.