ETV Bharat / city

TDP NIRASANA: రాష్ట్ర వ్యాప్తంగా.. తెదేపా రైతు దగా దినోత్సవం! - గోరంట్ల బుచ్చయ్యచౌదరి

వైకాపా పాలనలో రైతులు ఏ ఒక్క అంశంలోనూ సంతోషంగా లేరని.. తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఇది రైతు దినోత్సవం కాదని.. రైతు దగా దినోత్సవమని విమర్శించారు. కృష్ణా నికర జలాల విషయంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కపట నాటకాలాడుతున్నారన్న తెదేపా నేతలు.. నీటి వివాదంలో సీఎం జగన్‌ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రానికి తీరని నష్టం ఏర్పడుతోందన్నారు.

TDP NIRASANA
తెదేపా రైతు దగా దినోత్సవం నిర్వహణ
author img

By

Published : Jul 8, 2021, 9:16 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తెలుగుదేశం శ్రేణులు రైతు దగా దినం పేరిట వేర్వేరు రూపాల్లో నిరసనలు తెలిపాయి. సీఎం జగన్‌ ఇప్పటికైనా ఆర్భాటాలు మాని.. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని నేతలు సూచించారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉందని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా వప్పంగిలో నిరసన తెలిపిన రామ్మోహన్‌ నాయుడు.. రాష్ట్రంలో రైతులు క్రాఫ్ హాలిడేను ఎందుకు ప్రకటించారో ముఖ్యమంత్రి బదులివ్వాలని డిమాండ్ చేశారు.

రైతుల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతూ.. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద తెలుగుదేశం నేతలు నిరసనకు దిగారు. రెండేళ్లుగా రైతు సమస్యలను ఏమాత్రం పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం.. రైతు దినోత్సవం పేరుతో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి.. పంట కొనుగోళ్ల బకాయిలు చెల్లించాలని తెదేపా నేతలు ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్‌ చేశారు. కృష్ణా నికర జలాలను సముద్రం పాలు చేయడం దుర్మార్గమన్నారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తుంటే.. సీఎం జగన్‌ లేఖలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు.

సీఎం జగన్‌.. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకు స్వస్తి చెప్పి.. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని తెదేపా శ్రేణులు డిమాండ్‌ చేశాయి. మిల్లర్ల దయాదాక్షిణ్యాల మీద రైతులను గాలికొదిలేశారన్న మాజీమంత్రి దేవినేని ఉమ.. కృష్ణా జిల్లా జక్కంపూడిలో రైతులతో కలిసి నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. అనంతపురం జిల్లా ముత్తువకుంట్లలో మాజీమంత్రి పరిటాల సునీత బైఠాయించి నిరసన తెలిపారు. నకిలీ విత్తనాలు, పురుగు మందుల వ్యాపారాలు చేసేది వైకాపా నేతలేనని తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు.

ఇదీ చదవండి:

పోలవరం నిర్మాణంపై.. ఎన్జీటీ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.