ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల నిరసన.. సీఎం తీరుపై ఆగ్రహం - kurnool district news

"వ్యాక్సిన్ సరఫరా చేయండి - ప్రాణాలు కాపాడండి" అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు నిరసనలు చేపట్టారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఇళ్ల వద్దే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. 18 ఏళ్లు పైబడినవారికి రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని, ఆస్పత్రుల్లో పడకల కొరత తీర్చాలని.. అవసరమైన వారికి ఆక్సిజన్ అందించి రోగుల ప్రాణాలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

tdp leaders on corona measures
రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల నిరసన
author img

By

Published : May 8, 2021, 10:38 PM IST

గుంటూరు జిల్లాలో..

గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు నిరసన తెలియజేయగా.. ఇతర గ్రామాల్లో నేతలు ఇంటి వద్దే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పొరుగు రాష్ట్రాల్లో టీకాలను కొనేందుకు పోటీ పడుతుంటే సీఎం జగన్ మాత్రం ప్రత్యర్థులపై రాజకీయ కక్ష తీర్చుకొనేందుకు పోటీ పడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లాలో..

తెదేపా రాష్ట్ర కార్యదర్శి గొడుగుల గంగరాజు ప్రకాశం జిల్లా చీరాల లోని స్వగృహంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన చేపట్టారు. కొవిడ్​ రోగులకు ఆక్సిజన్​తో పాటు కేెంద్రాల్లో పడకలు పెంచాలని డిమాండ్​ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..

కరోనా నియంత్రణలో వ్యాక్సిన్ సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. ఐదు కోట్ల మందికి వ్యాక్సిన్ అవసరం కాగా 13 లక్షల మందికి వ్యాక్సిన్ ఆర్డర్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ.. వేల్పూరు లోని క్యాంపు కార్యాలయంలో నిరసన చేపట్టారు.

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరులో దీక్ష చేపట్టారు. టీకాలకు నిధులు కేటాయించకుండా ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు తరహాలో రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉచితంగా కరోనా చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

మొదటి డోసు వ్యాక్సిన్​ తీసుకున్న వారికి రెండో డోసు వ్యాక్సిన్ అందించలేని పరిస్థితిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉందని తెదేపా రాష్ట్ర కార్యదర్శి దావా పెంచల రావు అన్నారు. వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కరోనా నియమాలు పాటించి వైరస్​ వ్యాప్తిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.

కర్నూలు జిల్లాలో..

తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు చోడవరం నియోజకవర్గం వడ్డాదిలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ తీరుకు నిరసన తెలిపారు. కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజలను ఆదుకోవడంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారంటూ చోడవరం నియోజకవర్గ పార్టీ ఇన్​ఛార్జి బత్తుల తాతయ్య బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలుకు టీకా ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కర్నూలు తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలులో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పై కేసు నమోదు చెయ్యడం కక్ష్య సాధింపు చర్యలేనన్నారు.

కర్నూలులో కొత్తరకం వైరస్ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నందున స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల ఆరోగ్యం కాపాడండి అని చెప్పడంతో అక్రమంగా.. వైకాపా న్యాయవాదితో కేసు పెట్టించడాన్ని తెదేపా నాయకులు గౌరు వెంకట రెడ్డి ఆక్షేపించారు.

ఇవీ చదవండి:

కాలువలో వరదలా రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు!

సీఎం జగన్​కు వైద్యం గురించి ఏం తెలుసు?: వైకాపా ఎంపీ రఘురామ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.