ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని, వైకాపా నేతలను ప్రశ్నించారు. 'ఏడుసార్లు దిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు.. ప్రధాని, కేంద్ర మంత్రులకు సీఎం జగన్ విజ్ఞాపనలు ఇచ్చారు.. వాటి వివరాలు ఎందుకు చెప్పట్లేదు' అని ప్రశ్నించారు. ఇన్నిసార్లు కలిసినా కేంద్రం నుంచి ఒక్కపైసా అదనంగా నిధులు వచ్చిన దాఖలాలు లేవన్నారు.
పర్యటన వివరాలు వెల్లడించకపోతే ఏమనుకోవాలి... ఆయన కేసులకు సంబంధించి వెళ్తున్నారా..? అని యనమల ప్రశ్నించారు. ప్రధానితో ఎంతసేపు మాట్లాడారని కాదు... ఏమాత్రం నిధులు తెచ్చారని నిలదీశారు. అప్రజాస్వామిక చర్యలతో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. మూడు రాజధానుల వంటి నిర్ణయాలతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లే పరిస్థితి కల్పించారని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి: