సభలో లేనివాళ్ల గురించి మాట్లాడకూడదనే మర్యాదను అధికారపక్ష నేతలు విస్మరించారని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను నియంత్రించే పరిణామాలు లేనప్పుడు బహిష్కరించక ఏం చేయాలి? అని ప్రశ్నించారు. సభను అవమానిస్తూ ఆనందించే ధోరణి అధికార పార్టీలో కనిపిస్తోందని విమర్శించారు.
అసభ్య పదజాలంతో దూషణల పర్వంగా చట్టసభలను మార్చారని ధ్వజమెత్తారు. అధికార పక్షం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న ప్రస్తుత తరుణంలో.. ప్రజల తరఫున ప్రజల్లోకే వెళ్తామంటున్న యనమలతో మా ప్రతినిధి ముఖాముఖి..
సభను అవమానిస్తూ ఆనందించే ధోరణి అధికార పార్టీలో ఉంది. అసభ్య పదజాలంతో దూషణల పర్వంగా అసెంబ్లీ మారింది. సభలో లేనివాళ్లపై మాట్లాడకూడదనే మర్యాద విస్మరించారు. నియంత్రించే పరిణామాలు లేనప్పుడు బహిష్కరించక ఏం చేయాలి?. తప్పు చేశామని గ్రహించే స్థాయిలో అధికారపక్షం లేదు. ముందస్తు వ్యూహంతోనే సమావేశాల గడువు పెంచారనిపిస్తోంది. నిన్న జరిగిన అవమానకర ఘటనలో సీఎం పాత్ర కూడా ఉంది. తనను ఎంత అవమానించినా చంద్రబాబు ఏనాడూ బాధపడలేదు. చంద్రబాబు కుటుంబసభ్యులను కించపరచడం అత్యంత దారుణం. కనీసం క్షమాపణలు చెప్పాలని కూడా అధికార పక్షం భావించలేదు. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలన్న దానిపై పార్టీలో చర్చిస్తున్నాం.
-యనమల రామకృష్ణుడు, తెదేపా నేత
ఇవీచదవండి.