పురప్రజల తీర్పుని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తున్నట్లు తెదేపా పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. జగన్... ముఖ్యమంత్రిగా కంటే, మేనిప్లేటర్గా సమర్థుడని నిరూపించుకున్నారని విమర్శించారు. పురపోరులో 90శాతం స్థానాలు గెలవకుంటే పథకాలన్నీ కట్ చేస్తానని ముఖ్యమంత్రే... మంత్రులు, ఎమ్మెల్యేలతో అనడం మేనిప్లేషన్ చేయడం కాదా అని ప్రశ్నించారు. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా 70లక్షల మంది కేడర్ ఉన్న తెదేపా.. ఓటమి అంచున నిలబడటంపై ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. వాలంటీర్ల తీరు, అధికార యంత్రాంగం బెదిరింపులు అధికారపార్టీ గెలుపునకు కలిసొచ్చాయని పేర్కొన్నారు. పథకాలు రావని ప్రజలను భయపెట్టి గెలిచిన... గెలుపు ఒక గెలుపేనా అని దుయ్యబట్టారు. వ్యవస్థల బెదిరింపులను తట్టుకొని పోరాడిన తెదేపా శ్రేణులకు పార్టీ తరుపున సెల్యూట్ చేస్తున్నానన్నారు.
ఇదీ చదవండి:ఎన్నికల ఫలితాలు: మున్సిపోల్స్‌లో ఫ్యాన్ గాలి