రాజధానిగా అమరావతి కొనసాగటం వల్ల ఒక సామాజికవర్గానికే లాభామని సీఎం జగన్ దిల్లీలో ప్రజెంటేషన్లు ఇచ్చి వచ్చారని తెదేపా నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఐదేళ్ల క్రితం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ... జగన్ దుర్మార్గపు ఆలోచనలను తెలుసుకోవాలని కోరారు.
రాజధానికి భూములిచ్చిన రైతుల్లో అత్యధికంగా ఎస్సీలే ఉన్నారని వెల్లడించారు. ఒక సామాజిక వర్గాన్ని బూచిగా చూపి... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడికి దిగారని మండిపడ్డారు. రాజధాని తరలింపుతో ఎస్సీలకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తరఫున ఏ సలహాదారు వచ్చినా చర్చకు సిద్ధమే అని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: