చిత్తూరు జిల్లా జైలులో ఉన్న న్యాయమూర్తి రామకృష్ణకు ప్రాణ హాని ఉందంటూ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సందేశం పంపారు. మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వెళ్తే ప్రాణాలు పోతాయంటూ సహచర ఖైదీ తన తండ్రిని బెదిరిస్తున్నాడని జడ్జి తనయుడు వంశీ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. జిల్లా జైలులో గతంలో జరిగిన పరిణామాల దృష్ట్యా వంశీ భయపడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై చర్యలు తీసుకుని .. రామకృష్ణ ప్రాణాలు కాపాడాని తన సందేశం లో కోరారు.
ఇదీ చదవండి:
పరీక్షల నిర్వహణతో విద్యార్థులను ప్రమాదంలోకి నెడతారా?: లోకేశ్