జగన్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని తెదేపా నాయకురాలు వంగలపూడి అనిత విమర్శించారు. బాలికలు, మహిళలపై వాలంటీర్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలకు భద్రత లేదని మండిపడ్డారు. వాలంటీర్ల అరాచకాలకు జనం భయపడిపోతున్నారని అన్నారు. మహిళలు కన్నీరు జగన్ ప్రభుత్వానికి శాపంగా మారబోతుందని ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి..