PAYYAVULA : అమరావతి భూ కొనుగోళ్ల పై న్యాయ విచారణకు తాము సిద్ధమని.. విశాఖ భూ లావాదేవీలపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధమా అని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. తమ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం డొంక తిరుగుడు సమాధానం చెప్పి అడ్డంగా దొరికిపోయిందని మండిపడ్డారు. విశాఖలో 3ఏళ్ల భూ కొనుగోళ్ల మీద సవాల్ విసిరితే ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
"అమరావతి భూ కొనుగోళ్లపై న్యాయ విచారణకు నేను సిద్ధం. విశాఖ భూలావాదేవీలపై న్యాయ విచారణకు ప్రభుత్వం సిద్ధమా? విశాఖలో మూడేళ్ల భూకొనుగోళ్లపై సవాల్ విసిరితే స్పందన లేదు. రాజధాని ప్రకటన చేశాకే భూములు కొంటే తప్పేంటని అడిగితే స్పందన లేదు. అసత్య ఆరోపణలతో న్యాయస్థానాల్లో చీవాట్లు తిన్నారు. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పింది. అయినా ప్రభుత్వం తీరు మారట్లేదు." - పయ్యావుల కేశవ్, తెదేపా నేత
శాసనసభలో 3ఏళ్లుగా చెప్పిన బుర్రకథలే బుగ్గన చెప్తున్నారని విమర్శించారు. సీఎం మెప్పు కోసం తెలుగుదేశం నాయకుల్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాజధాని ప్రకటన చేశాకే భూములు కొంటే తప్పేంటని అడిగితే ప్రభుత్వం వద్ద సమాధానం లేదన్నారు. అసత్య ఆరోపణలతో న్యాయస్థానాల్లో బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. రాజధాని భూముల్లో ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ప్రభుత్వం తీరు మారట్లేదని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి: