సీఎం జగన్ రాజకీయాలు మాని ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టాలని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి విమర్శించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అదనపు అడిషనల్ అడ్వకేట్ జనరల్‌ను నియమించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఏ అర్హత లేని జాస్తి నాగభూషణాన్ని సీఎం జగన్ ఎందుకు నియామించారని నిలదీశారు.
గత సంప్రదాయాలకు విరుద్ధంగా రెండో అదనపు అడ్వకేట్ జనరల్‌గా ఎలాంటి అనుభవం, హైకోర్టులో కనీసం వకాల్తాలు దాఖలు చేయని జాస్తి నాగభూషణంను గత ఏడాది డిసెంబర్లో ప్రత్యేక జీవో ద్వారా నియమించారని విమర్శించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు కాబట్టే జాస్తి నాగభూషణానికి ఏజీ కంటే అదనంగా ప్రత్యేక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి:
'7 రోజుల్లో రద్దు చేస్తానన్నారు.. 765 రోజులైంది.. మాట నిలబెట్టుకోండి'