కొవిడ్ బాధితుల్ని ఆదుకోవాలని తెదేపా చేసిన డిమాండ్లనే సుప్రీంకోర్టు సమర్ధించిందని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు హర్షం వ్యక్తం చేశారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే.. ఏపీలో ప్రత్యేక ప్యాకేజి ప్రకటించి కొవిడ్ బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్యను తక్కువ చేసి చూపించారని ఆరోపించారు.
కొవిడ్‌తో చనిపోయిన ప్రతి మరణాన్ని మదింపు చేయాలన్నారు. వైకాపా నేతలు చేసే అవినీతిలో ఒక్క శాతం ఖర్చు చేసినా బాధిత కుటుంబాలన్నింటిని ఆదుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యం అందక, ప్రైవేటు వైద్యానికి డబ్బులు లేక రోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. సాధన దీక్షలో చంద్రబాబు డిమాండ్ చేసినట్లుగా కొవిడ్‌తో చనిపోయిన కుటుంబాలకు రూ.10లక్షలు, ఆక్సిజన్ అందక చనిపోయిన కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ.. ఉత్తమ ఆస్పత్రిగా బసవ తారకం హాస్పిటల్‌కు గుర్తింపు.. బాలకృష్ణ, నారా లోకేశ్ హర్షం