అద్భుత గానప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ అవార్డు రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ వార్త విన్న ప్రతి తెలుగు హృదయం గర్విస్తోందన్నారు.
పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు ప్రముఖులందరికి లోకేశ్ అభినందనలు తెలిపారు. ఏపీకి చెందిన వయోలిన్ కళాకారులు అన్నవరపు రామస్వామి, మృదంగ కళాకారిణి నిడుమోలు సుమతి, సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్‌రావులకు అభినందనలు తెలిపారు. తెలంగాణకు చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు అభినందనలు తెలియజేశారు.
ఇదీ చదవండి: 'ఐదుగురు తెలుగువారికి 'పద్మ' అవార్డులు రావడం గర్వకారణం'