ETV Bharat / city

వైకాపా మాటలు ఆకాశమంత... పనులు అరిటాకంత - వైసీపీ ప్రభుత్వంపై కళా విమర్శలు

ఖరీఫ్ సీజన్​ ప్రారంభమైనా.. ప్రభుత్వం తగిన ప్రణాళిక సిద్ధం చేయలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో లేవన్నారు. రబీ ధాన్యం డబ్బులు ఇంకా చెల్లించకపోవటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వడ్డీలకు తెచ్చి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఖరీఫ్ రుణ ప్రణాళిక కోసం బ్యాంకర్ల సమావేశం కూడా ప్రభుత్వం నిర్వహించలేదని కళా ఆరోపించారు.

కళా వెంకట్రావు
కళా వెంకట్రావు
author img

By

Published : Jun 26, 2020, 12:32 PM IST

జూన్ నెల ముగుస్తున్నా.. ప్రభుత్వం ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. రుణ ప్రణాళిక కోసం బ్యాంకర్లతో సమావేశం కూడా పెట్టలేదని ఆయన విమర్శించారు. రైతులకు అవసరమైన స్థాయిలో విత్తనాలు అందుబాటులో లేవని ఆరోపించారు. రైతుల విషయంలో వైకాపా సర్కారు మాటలు ఆకాశమంత....పని అరిటాకు అంత ఉందని కళా ఎద్దేవా చేశారు. ఇంత వరకు రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో లేక మార్కెట్​లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. నకిలీ, కల్తీ విత్తనాలు అమ్ముతూ సీడ్ మాఫీయా వందల కోట్లు దండుకుంటోందని ఆరోపించారు.

కొన్ని విత్తన సంస్థలు నకిలీ, కల్తీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నా వారిపై చర్య తీసుకోవడానికి ప్రభుత్వం తటపటాయిస్తోందని కళా విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఆచరణకి నోచుకోలేదన్నారు. ధాన్యం అమ్మిన డబ్బులు రాక, ఖరీఫ్ విత్తనాలు, ఎరువులు కొనుగోలు కోసం బయట నుంచి వడ్డీలకు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులు పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్న కళా వెంకట్రావు.... ధాన్యం డబ్బులు కోసం రైతులు అధికారులు చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లోను వ్యవసాయ రంగాన్ని దారుణంగా దగా చేసిందని కళా వెంకట్రావు విమర్శించారు.

ఇదీ చదవండి : కొత్త ప్రాజెక్టులపై సమాచారం కోరిన కేంద్రం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.