'చేయూత' పేరుతో తమ గొంతుకోసి గిరిజన ద్రోహిగా జగన్ రెడ్డి మారారని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ధ్వజమెత్తారు. "రాష్ట్రంలో ఉన్న గిరిజన మహిళల సంఖ్యకు.. ప్రభుత్వం సాయం అందించే వారి సంఖ్యకు పొంతనలేదు. 45 ఏళ్లు నిండిన గిరిజన మహిళలకు అందించే సాయంలోనూ జగన్ రెడ్డి చేతివాటం చూపారు. చేయూత ప్రకటనలకు చేసినంత ఖర్చు కూడా గిరిజన సంక్షేమానికి చేయలేదు. రూ.50వేలు చొప్పున రుణాలు ఇస్తామని ప్రకటించి.. బ్యాంకు గ్యారంటీ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. గిరిజనులకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలు రద్దు చేసిన జగన్ రెడ్డి.. నేడు చిల్లర వేస్తూ సంక్షేమం అనటం సిగ్గు చేటు" అని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
MLC THOTA: పోలీసులపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అసహనం.. ఎందుకో తెలుసా?