ETV Bharat / city

TDP PROTEST: డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా ఆందోళన.. ఉద్రిక్తత - ayanna comments on cm jagan

డీజీపీ కార్యాలయం వద్ద తెదేపా ఆందోళన.. ఉద్రిక్తత

author img

By

Published : Sep 17, 2021, 5:27 PM IST

Updated : Sep 18, 2021, 5:14 AM IST

17:22 September 17

చంద్రబాబు ఇంటివద్ద దాడిపై డీజీపీకి వినతిపత్రం ఇచ్చిన తెదేపా నేతలు

 తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపికి వినతిపత్రం ఇచ్చేందుకు పోలీసు ప్రధాన కార్యాలయానికి వెళ్లిన తెదేపా నాయకుల బృందాన్ని లోపలికి అనుమతించకుండా గేటు బయటే పోలీసులు అడ్డుకోవటంతో శుక్రవారం సాయంత్రం అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో అక్కడకు వచ్చిన వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కార్యాలయం లోపలికి సాదరంగా ఆహ్వానించిన పోలీసులు.. తమను అడ్డుకోవటమేంటని తెదేపా నేతలు వారిని నిలదీశారు. ‘ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన వ్యక్తని, అధికార పార్టీ ఎమ్మెల్యే అని ఆళ్ల రామకృష్ణారెడ్డిని లోపలికి పంపించి... తెదేపాకు చెందిన దళిత ఎమ్మెల్యేను గేటు బయట ఉంచేస్తారా? ఎస్సీలకు డీజీపీ కార్యాలయంలో చోటు లేదా?’ అని తెదేపా నాయకులు... పోలీసు అధికారుల్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏఐజీ (పరిపాలన)గా పనిచేస్తున్న ఎస్పీ అమ్మిరెడ్డికి, తెదేపా నాయకులకు మధ్య గంటసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి డీజీపీ కార్యాలయంలోకి వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు నలుగురు తెదేపా ఎమ్మెల్యేలను అనుమతించారు. ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు లోపలికి వెళ్లి అమ్మిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.

చంద్రబాబు ఇంటివద్ద జరిగిన ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేయాలని తెదేపా నాయకులు, ఎమ్మెల్యేలు నిర్ణయించారు. సాయంత్రం 4.30కు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు ఒక బృందంగా డీజీపీ కార్యాలయం వద్దకు వెళ్లారు. వారిని లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. తాము డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని చెప్పగా.... ఎస్పీ అమ్మిరెడ్డి కార్యాలయం నుంచి బయటకు వచ్చి వారితో మాట్లాడారు. కార్యాలయంలో డీజీపీ లేరని, వినతిపత్రం తనకే ఇవ్వాలని కోరారు. తమను లోపలికి అనుమతిస్తే ఇస్తామని తెదేపా నాయకులు చెప్పగా, అమ్మిరెడ్డి నిరాకరించారు. అదే సమయంలో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాగా... పోలీసులు ఆయన్ను లోపలికి తీసుకెళ్లారు. దీంతో తెదేపా నాయకులు... ఆళ్లను లోపలికి పంపించి తమను అడ్డుకోవటమేంటని పోలీసుల్ని నిలదీసి వారి తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వాగ్వాదం చోటుచేసుకుంది.

వాగ్వాదం ఇలా...
నిమ్మల రామానాయుడు: బాధితులమైన మమ్మల్నేమో రోడ్డుపై నిలిపేశారు. నిందితుల్ని మాత్రం కార్యాలయం లోపలికి పంపించారు. ఇదేం పద్ధతి?
ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి : లోపల ఎవరున్నారు? నిందితులు ఎవరు? (తీవ్ర స్వరంతో గద్దిస్తూ)
నిమ్మల: జోగి రమేష్‌.. జోగి రమేష్‌...
అమ్మిరెడ్డి: నిందితులెవరో దర్యాప్తులో తేలుతుంది. నువ్వు చెప్పేదేంటి?
నిమ్మల: మాపై దాడి జరిగింది కనుకే.. మేము చెబుతున్నాం.
అమ్మిరెడ్డి: మీరు వినతిపత్రం ఇస్తే ఇవ్వండి... లేదంటే మా చర్యలు మేము తీసుకుంటాం (అసహనంతో)
నిమ్మల, తెదేపా నేతలు: మేము సామరస్యంగా మాట్లాడుతుంటే... రెచ్చగొట్టే ధోరణి సరికాదు
అమ్మిరెడ్డి: మీకూ అదే వర్తిస్తుంది. ‘నిందితులు’ అని ఎందుకు అంటున్నారు?
నిమ్మల: మాపై దాడిచేసిన వాళ్లను నిందితులు అని కాకపోతే ఏమని పిలవాలి?
అమ్మిరెడ్డి: ముందు మమ్మల్ని దర్యాప్తు చేయనివ్వండి
నిమ్మల, నేతలు: మా అధ్యక్షుడి ఇంటిమీదకొచ్చి వాళ్లు దాడి చేశారు. మా పార్టీ ఎమ్మెల్యేలు లోపలికి వచ్చి వినతిపత్రం ఇస్తారు. మమ్మల్ని పంపించండి
అమ్మిరెడ్డి: కుదరదు.. ఇక్కడే ఇవ్వండి
నిమ్మల, నేతలు: అలా కాదు.. కార్యాలయం లోపలే ఇస్తాం.

అమ్మిరెడ్డి: ఇక్కడ కంటే మంచి ఫోకస్‌ ఇంకెక్కడ మీకు వస్తుంది? (మీడియా లోగోల వైపు చూపిస్తూ)
వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే: హోదాలో మాతో సమానమైన వైకాపా ఎమ్మెల్యే ఆళ్లను లోపలికి అనుమతించి మమ్మల్ని ఎందుకు ఆపేశారు?
అమ్మిరెడ్డి: వినతిపత్రం ఇక్కడే ఇచ్చేయండి. మీ పనైపోతుంది.
నిమ్మల: ఇది అన్యాయం. ఎమ్మెల్యేలం ఉన్నాం. మమ్మల్ని అనుమతించండి. వైకాపా ఎమ్మెల్యేకు ఏ గౌరవం ఇచ్చారో.. మాకూ అదే ఇవ్వండి.
అమ్మిరెడ్డి: వినతిపత్రం ఇస్తారా? ఇవ్వరా? (తీవ్ర స్వరంతో)
ధూళిపాళ్ల నరేంద్ర: అధికార పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డీజీపీ కార్యాలయం లోపల ఉంటారు.. తెదేపాకు చెందిన దళిత ఎమ్మెల్యే మాత్రం డీజీపీ కార్యాలయం బయట ఉండాలా? ఎస్సీలకు ఇచ్చే న్యాయం ఇదేనా? ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అని ఆళ్ల రామకృష్ణారెడ్డిని లోపలికి పంపిస్తారా? మా పార్టీ దళిత ఎమ్మెల్యేను లోపలికి పంపించరా? ఎస్సీలకు డీజీపీ కార్యాలయంలో చోటు లేదా?
అమ్మిరెడ్డి: సరే.. కార్యాలయం గేటు లోపల ఎక్కడి వరకూ, ఎవరు వచ్చి వినతిపత్రమిస్తారో చెప్పండి.
తెదేపా నేతలు: వినతిపత్రం ఇవ్వడానికి కూడా షరతులేనా? మమ్మల్ని గంటకు పైగా గేటు బయట ఎందుకు నిలబెట్టారు? అదే వైకాపా ఎమ్మెల్యేను సాదరంగా లోపలికి ఎందుకు తీసుకెళ్లారు?
అమ్మిరెడ్డి: మాకు చెప్పడానికి మీరెవరు?
నిమ్మల: మేము ప్రజాప్రతినిధులం.

పోలీసులే బాధ్యత వహించాలి

‘వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్‌ అనుచరులతో వచ్చి చంద్రబాబు ఇంటిపై దాడిచేశారు. ప్రతిపక్ష నేత ఇంటిని ముట్టడిస్తానని జోగి రమేష్‌ గురువారమే ప్రకటించారు. ఇది ముందే తెలిసినా చంద్రబాబు నివాసం వద్ద భద్రత పెంచటంలో పోలీసులు విఫలమయ్యారు. దాడిలో తెదేపా నాయకులు పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడికి పోలీసులే బాధ్యత వహించాలి. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డీజీపీని ఉద్దేశిస్తూ ఇచ్చిన వినతిపత్రంలో తెదేపా నాయకులు పేర్కొన్నారు.

ఇదీ  చదవండి: 

CBN HOME: అయ్యన్న వ్యాఖ్యలపై వైకాపా ఆందోళన..చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

AYYANNA PATRUDU: చంద్రబాబును చంపేందుకు యత్నం: మాజీ మంత్రి అయ్యన్న

Last Updated : Sep 18, 2021, 5:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.