రాష్ట్రంలో రైతుల్ని ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. నష్టాలతో తక్కువ ధరకు తమ ఉత్పత్తుల్ని అమ్ముకునే దుస్థితి రాష్ట్రంలో రైతులకు ఏర్పడిందన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా వ్యవసాయ శాఖమంత్రి సమీక్షలు నిర్వహించి అబద్ధాలు చెప్తున్నారని చినరాజప్ప ఆరోపించారు.
ఇదీ చదవండి: ఇవి బాగా తినండి.. కరోనాను దరిచేరనివ్వకండి!