వైకాపా ప్రభుత్వం దశలవారీగా మద్య నిషేధం అని ఊదరగొట్టి...దశల వారీగా ఆదాయం వనరుగా మార్చారని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమా విమర్శించారు. ఏనాడు చూడని బ్రాండ్స్‌ని ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. చెత్త బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చి ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జె ట్యాక్స్ పేరుతో నెలకి 350 కోట్లు వసూళ్లు చేస్తున్నారని... సాక్షాత్తు సీఎం జగన్, వైకాపా నేతలు లిక్కర్ మాఫియాను నడుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని చెప్పారు. మద్యంపై ఆదాయం అవసరం లేదన్న ప్రభుత్వం..ధరలు ఎందుకు పెంచుతుందని నిలదీశారు. వైకాపా నేతలు, ఎమ్మెల్యేలు అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : ఏపీ నుంచి ఆదాయ పన్ను రూ.13,446 కోట్లు