అధికారంలోకి వస్తే రూ. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. కేవలం 10వేల ఉద్యోగాలతో నిరుద్యోగులను మోసగించారు. సీఎం జగన్ విడుదల చేసింది ఓ చీటింగ్ క్యాలెండర్. అందులో చెప్పిన లెక్కలు, మాయమాటలు అన్నీ అంకెల గారడీనే. 2 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్న వాళ్ళు.. ఏడాదికి కనీసం లక్ష ఉద్యోగాలైన ఇవ్వాల్సి ఉండగా.. 10వేల ఉద్యోగాల ప్రకటనతో మోసం బయటపడింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉన్న ఉద్యోగాలను జగన్ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకోవటం సిగ్గుచేటు. ఇకనైనా అబద్ధాలతో ప్రజలను మోసగించటం మానుకోవాలి.
- తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ జనాభా 5.23 కోట్లు.. లింగనిష్పత్తిలో దేశంలో ఏపీది 16వ స్థానం!