తెదేపా అభ్యర్థులుగా నామపత్రాలు దాఖలు చేసి.. ప్రస్తుతం పార్టీ మారిన వారి స్థానాల్లో నోటాకు ప్రచారం చేస్తామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నది. ప్రాదేశిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తమ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారని అన్నారు. అయినా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని పరిస్థితులను బట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు అఖిలప్రియ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వారి గెలుపుకు కృషి చేస్తానన్నారు. వైకాపా నాయకులు పోలీసులు, అధికారులు, వాలంటీర్ల అండతో విజయం సాధిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండీ.. తిరుపతిలో వాడీవేడిగా పార్టీల ప్రచారాస్త్రాలు