మంత్రి పదవి ద్వారా ప్రజలకెలా మేలు చేయాలో కొడాలి నానికి తెలియక చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మం దుయ్యబట్టారు. సన్నబియ్యానికి, దొడ్డు బియ్యానికి తేడా తెలియని అజ్ఞాన మంత్రి కొడాలి నాని అని విమర్శించారు. లోకేశ్ చేసిన రైతు పరామర్శ యాత్రకు అధికార పార్టీ ఇంతలా ఉలిక్కిపడుతుందుడటం ఆయన సమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు