ETV Bharat / city

'రాజధానిని బొత్స శ్మశానంతో పోలుస్తారా... క్షమాపణ చెప్పాల్సిందే' - వైకాపాపై తెదేపా కామెంట్స్

మంత్రి బొత్స వ్యాఖ్యలపై తెదేపా నేతలు మండిపడ్డారు. రాజధానిని శ్మశానంతో పోల్చడం గర్హనీయమన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో 29 గ్రామాలను శ్మశానంతో పోలుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 34 వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాలను అవహేళన చేస్తారా? అంటూ ప్రశ్నించారు. రాజధానిని నిర్వీర్యం చేసి ఇప్పుడిలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు.రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుందని అన్నారు.

tdp
tdp
author img

By

Published : Nov 26, 2019, 10:47 AM IST

Updated : Nov 26, 2019, 10:55 AM IST

బొత్స క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం డిమాండ్

రాజధానిని శ్మశానంతో పోలుస్తూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. ఆయనను వెంటనే బర్తరఫ్‌ చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. శాసనసభ, హైకోర్టు, సచివాలయాలు మంత్రికి శ్మశానంలా కనిపిస్తున్నాయా..? అంటూ నిలదీశారు. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాలను అవహేళన చేయడం సబబు కాదన్నారు. మంత్రి బొత్సను వెంటనే బర్తరఫ్‌ చేయకపోతే ఈ వ్యాఖ్యల వెనుక సీఎం జగన్‌ ప్రోద్బలం ఉన్నట్టేనని ఆరోపించారు. చట్టసభలను అవమానించినందుకు ప్రివిలేజ్ నోటీసు ఇస్తామన్నారు. 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడినందుకు మంత్రి బొత్స క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. రాజధానిని శ్మశానంతో పోల్చడం మంత్రి బొత్స దిగజారుడుతనానికి నిదర్శనమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. జరుగుతున్న పనులను ఆపి రాజధానిని నిర్వీర్యం చేసి ఇప్పుడిలా మాట్లాడటం దురదృష్టకరమని మండిపడ్డారు.

ఇవీ చదవండి:

సర్వత్రా సానుకూలం... మార్కెట్లలో నవోత్సాహం

sample description
Last Updated : Nov 26, 2019, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.