నేతన్నలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోగును వస్త్రంగా మలిచి.. నేతన్నలు మానవాళికి నాగరికత నేర్పారని కొనియాడారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాటి పరిస్థితుల్ని.. వైకాపా ప్రభుత్వంలో నేతన్నల దుస్థితిని తలచుకుంటే మనసు కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతలకు స్వర్ణయుగంగా ఉన్న పథకాలను రద్దుచేసి చీకట్లలోకి నెట్టేశారని విమర్శించారు.
చేనేత కార్మికులకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మోసపు నేతలో జగన్ చేయి తిరిగిన కళాకారుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేత కార్మికులకు ‘నేతన్న నేస్తం’ అందించడంతో పాటు అదనంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రోత్సాహకాలు, రాయితీలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పరిటాల సునీత స్థానిక నేతన్న విగ్రహానికి పూలమాల వేశారు. చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదంటూ.. ధర్మవరం గాంధీ కూడలి వద్ద చేనేత నాయకులు నిరసన తెలిపారు.
ఇదీ చదవండి: