ETV Bharat / city

ఇసుక అక్రమాలపై నేడు తెదేపా ఆందోళనలు !

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ మరోమారు ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులతోపాటు ...వివిధ రంగాలపై పడిన ప్రభావాన్ని నిరసిస్తూ నేడు  అన్ని రెవెన్యూ డివిజన్లలో ఆందోళనలు నిర్వహించనున్నారు.

author img

By

Published : Oct 25, 2019, 4:52 AM IST

ఇసుక అక్రమాలపై నేడు తెదేపా ఆందోళనలు !

రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్లలో తెలుగుదేశం పార్టీ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించనుంది. ఇసుక కొరత వల్ల నష్టపోయిన వివిధ వర్గాల వారిని ఈ ఆందోళనల్లో పాల్గొనేలా చూడాలని నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వర్ష ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈనెల 30లోగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇసుక కొరత వల్ల ఇళ్ల నిర్మాణాలను వాయిదా వేసుకోమని వైకాపా ప్రభుత్వం ప్రకటించడం వారి అసమర్థతకు నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు.

ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత వల్లే లారీ ఇసుక లక్ష రూపాయలు పలుకుతోందని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. జీవనోపాధి కోల్పోయిన కార్మికులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ చర్యలతో ప్రజలుపడుతున్న కష్టాలను ఇకపై వెలుగెత్తి చాటాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆయా వర్గాల ప్రజలకు అండగా ఆందోళనలు, నిరసనలు తెలపనున్నారు. పార్టీ శ్రేణులకు మరింత దగ్గరయ్యేందుకు ఇకపై చంద్రబాబు జిల్లా పర్యటనలను 2 రోజులు కాకుండా 3రోజులకు పొడిగించారు. ఈనెల 29, 30, 31న కృష్ణా జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

ఇసుక అక్రమాలపై నేడు తెదేపా ఆందోళనలు !

ఇదీచదవండి

వైకాపా పతనానికి ఇసుక కొరతే నాంది : పవన్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.