ETV Bharat / city

CHANDRABABU NAIDU: 'వెంకన్న ఆశీర్వాదంతో అమరావతే రాష్ట్ర రాజధాని అవుతుంది' - చంద్రబాబు తాజా వార్తలు

వెంకన్న అశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్​కు రాజధాని అమరావతి తప్పకుండా దక్కుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. అమరావతి రైతులు 700 రోజులుగా చేస్తున్న మహోద్యమానికి ఆయన సంఘీభావం తెలిపారు.

TDP CHIEF CHANDRABABU NAIDU SPEAKS ABOUT AMARAVATHI FARMERS PROTEST
'వెంకన్న ఆశీర్వాదంతో అమరావతే రాష్ట్ర రాజధాని అవుతుంది'
author img

By

Published : Nov 16, 2021, 2:53 PM IST

ప్రజారాజధాని అమరావతి కోసం 700 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న మహోద్యమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరూ అమరావతినే తమ రాజధానిగా కోరుకుంటున్నారన్న చంద్రబాబు... మహా పాదయాత్రకు వచ్చిన మద్దతే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజల ఆకాంక్షలతో పనిలేదన్నట్లుగా పాదయాత్రకు ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. మద్దతు తెలిపిన ప్రజలపై లాఠీ ఛార్జ్ చేయిస్తోందని విమర్శించారు.

ఎంత దౌర్జన్యం చేసినా ప్రజల ఆకాంక్షను అణగదొక్కలేరని చంద్రబాబు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్​కు రాజధాని అమరావతి తప్పకుండా దక్కుతుందని ట్వీట్ చేశారు. అమరావతికి తిరుపతి వెంకన్న ఆశీర్వాదం ఉందన్నారు.

  • ప్రజా రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన మహోద్యమం 700 రోజులకు చేరుకుంది. ఉద్యమంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర కూడా 16వ రోజుకు చేరుకుంది.అమరావతి ఉద్యమంలో అమరులైన 189 రైతులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాను(1/3) #AmaravatiFarmersMarch pic.twitter.com/hNZttlNR7B

    — N Chandrababu Naidu (@ncbn) November 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ఎంత దౌర్జన్యం చేసినా ప్రజల ఆకాంక్షను అణగదొక్కలేరు. అంతిమ విజయం ప్రజలదే. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి తప్పకుండా దక్కుతుంది. అందుకు వెంకన్న ఆశీర్వాదం ఉంది. తెలుగుదేశం పార్టీ మద్దతు ఎల్లవేళలా ఉంటుంది.(3/3)#700DaysOfAmaravatiProtests

ఇదీ చూడండి:

700వ రోజుకు అమరావతి మహోద్యమం.. 16వ రోజు మహాపాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.