ETV Bharat / city

Chandrababu on CM Jagan: 'రాష్ట్ర ఆదాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలి'

Chandrababu on CM Jagan: రాష్ట్ర ఆదాయం గాడిన పడిందన్న సీఎం వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. ఆదాయం బాగుంటే ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడి జీవితాలను ఎందుకు చిధ్రం చేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రజలను పీడిస్తూ వసూలు చేస్తున్న పన్నులు ఎటుపోతున్నాయని నిలదీశారు. రాష్ట్ర ఆదాయంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

TDP chief Chandrababu
చంద్రబాబు
author img

By

Published : Oct 7, 2022, 2:25 PM IST

Chandrababu on CM Jagan: రాష్ట్ర ఆదాయం గాడిన పడిందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం బాగుంటే ప్రభుత్వ వైఫల్యాలు... సామాన్యుడి జీవితాలను ఎందుకు చిధ్రం చేస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలనా దుస్థితికి పలు ఘటనలే ఉదాహరణలు అని తెలిపారు. ప్రజలను బాధిస్తున్న పన్నులు ఎటుపోతున్నాయని నిలదీశారు. లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయని ధ్వజమెత్తారు.

  • రాష్ట్రంలో పాలనా దుస్థితికి ఈ ఘటనలే ఉదాహరణలు. ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడి జీవితాలను ఎలా చిధ్రం చేస్తున్నాయో చెప్పడానికి ఇవి నిదర్శనం. ప్రజలను బాదేస్తున్న పన్నులు ఎటుపోతున్నాయి... లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయి? ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే!#JaganFailedCM pic.twitter.com/hXNvnZ787l

    — N Chandrababu Naidu (@ncbn) October 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాకినాడ జిల్లా జె.తిమ్మాపురంలో అసుపత్రికి వెళుతున్న పసిబిడ్డ గుంతల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన ఘటనను చంద్రబాబు ప్రస్తావించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ బిల్లులు మంజూరు కాక...క్యాన్సర్ బాధితుడైన తండ్రి వైద్యానికి డబ్బులు లేక వేదన పడుతున్న లేపాక్షి మండలం వెంకటశివప్ప ఘటనను వివరించారు. రాష్ట్ర ఆదాయం గాడిన పడిందన్నసీఎం సమీక్ష వార్తను, వారం రోజులు అయినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పడని అంశాన్ని పోల్చుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రభుత్వం... ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్​ చేశారు.

"రాష్ట్రంలో పాలనా దుస్థితికి ఈ ఘటనలే ఉదాహరణలు. ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడి జీవితాలను ఎలా చిధ్రం చేస్తున్నాయో చెప్పడానికి ఇవి నిదర్శనం. ప్రజలను బాదేస్తున్న పన్నులు ఎటుపోతున్నాయి... లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయి? ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే!" -చంద్రబాబు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.