ఉపాధి హామీ బిల్లుల బకాయిలపై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పెండింగ్ బిల్లుల విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఉపాధి హామీ బిల్లుల బకాయిలపై మరో నిరసన(protest) కార్యక్రమానికి తెదేపా(tdp) పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలోని ఎంపీడీవో(mpdo) కార్యాలయాల్లో... పార్టీ కార్యకర్తలు నిరసన తెలపనున్నారు. 5 డిమాండ్లతో అధికారులకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. పెండింగ్ బిల్లులపై ఇప్పటికే కలెక్టర్లకు తెలుగుదేశం నేతలు వినతిపత్రాలు అందించారు. జూలై నెలాఖరులోగా బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయట్లేదని మండిపడ్డారు.
ఇదీ చదవండి..
VISHAKA STEEL FIGHT: దిల్లీకి విశాఖ ఉక్కు కార్మిక నేతలు.. నేడు జంతర్ మంతర్ వద్ద నిరసన