ETV Bharat / city

సామాజిక మాధ్యమాల్లో పోస్టుల కేసు... వెంకటేష్‌కు బెయిల్

సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహారంలో సీఐడీ అరెస్టు చేసిన తెదేపా కార్యకర్త గార్లపాటి వెంకటేష్‌కు బెయిల్ మంజూరైంది. వెంకటేష్ ను రిమాండ్ కు పంపాలని సీఐడీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చి న్యాయమూర్తి... ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సొంతపూచీపై వెంకటేషకు బెయిలిచ్చారు. సిఐడీ అధికారులు కుట్రపూరితంగా వెంకటేష్ పై కేసు పెట్టారని... దీనిపై ప్రైవేటు కేసు వేయనున్నట్లు ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు.

వెంకటేష్‌
వెంకటేష్‌
author img

By

Published : Jul 2, 2022, 4:55 AM IST

ముఖ్యమంత్రి కుటుంబంపై పోస్టులు పెట్టారంటూ సీఐడీ పోలీసులు ….. యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న అమరావతి మండలం ధరణికోటలోని వెంకటేష్ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.ఇంటి తలుపులు పగులగొట్టి మరీ అరెస్టు చేయటం విమర్శలకు తావిచ్చింది. వెంకటేష్‌తో పాటు సాంబశివరావు అనే మరో కార్యకర్తను అదుపులోకి తీసుకున్నప్పటికీ... విచారించి గురువారం రాత్రి వదిలివేశారు. వెంకటేష్‌ని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా... తనను సీఐడీ అధికారులు కొట్టారని చెప్పారు. దీంతో జీజీహెచ్ లో చేర్చి అక్కడి వైద్యుల నుంచి నివేదిక ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ తర్వాత వెంకటేష్‌కు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించారు. ఈసీజీతో పాటు, ఎంఆర్ఐ, సిటీస్కాన్ తో పాటు మెదడు, నరాలకు సంబంధించిన స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. గాయాలు లేవని నివేదిక ఇవ్వాలంటూ వైద్యులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా శుక్రవారమంతా జీజీహెచ్​లో హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు వైద్య పరీక్షలు పూర్తి చేసి ఆ నివేదికను శుక్రవారం సాయంత్రం న్యాయమూర్తికి సీల్డ్ కవర్లో అందించారు. ఆ తర్వాత వెంకటేష్‌ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.

ఈ కేసులో సరైన ఆధారాలు లేనందున వెంకటేష్ ను రిమాండ్‌కు పంపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సీఐడీ అరెస్టు చేసిన మిగతా వారిని నోటీసులు ఇచ్చి పంపించేసి...వెంకటేష్ ఒక్కరినే రిమాండ్ కోరటమేంటని ప్రశ్నించారు. తప్పు చేసినట్లు సరైన ఆధారాలు లేవన్నారు. సీఐడి పోలీసులు తనపట్ల చాలా దారుణంగా ప్రవర్తించారని వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ పై బయటకు రాగానే వెంకటేష్ చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.