జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) అంశంపై తమిళనాడు ఎంపీలు కళానిధి వీరాస్వామి, టీఎస్‌కే ఇళంగోవన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాసిన లేఖను జగన్‌కు అందించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న బోధనాసుపత్రుల ప్రవేశాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీనికోసమే భాజపాయేతర రాష్ట్రాల సీఎంలకు తమ నేత స్టాలిన్ లేఖ రాసినట్లు జగన్‌కు వివరించారు. నీట్ విధానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, రాష్ట్రాల హక్కులను హరిస్తోందని లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టులో విచారణ