ETV Bharat / city

గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల పిటిషన్​పై సుప్రీం విచారణ.. 18కి వాయిదా - ఏపీపీఎస్సీ తాాజా వార్తలు

గ్రూప్‌-1 పరీక్ష నిలిపివేతపై సింగిల్ జడ్జ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. ఏపీపీఎస్సీ ముఖాముఖికి ఎంపికైన అభ్యర్థులు.. సుప్రీంను ఆశ్రయించారు. అప్పీళ్లపై విచారణను ధర్మాసనం ఆగస్టు 18కి వాయిదా వేసింది.

supreme notice to appsc in group 1 issue

author img

By

Published : Jul 24, 2021, 11:48 AM IST

గ్రూప్‌-1 పరీక్ష ప్రక్రియ నిలిపివేతపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. సింగిల్‌ జడ్జి వద్ద ప్రధాన పిటిషన్లు ఆగస్టు 9న విచారణకు రానున్న నేపథ్యంలో అప్పీళ్లను ఆగస్టు 18కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అవసరం మేరకు అప్పీళ్లపై విచారిస్తామని పేర్కొంది.

ఇంటర్వ్యూ ప్రక్రియ కొనసాగించి, ఫలితాలు వెల్లడి చేయకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని ఏపీపీఎస్సీ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించలేదు. అప్పీళ్లపై విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.

ఇదీ చదవండి:

Huge Floods to Godavari: గోదావరికి వరద ఉద్ధృతి.. సముద్రంలోకి 3.26 లక్షల క్యూసెక్కులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.