ETV Bharat / city

ఎందుకంత తొందర.. రాజధానిపై హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకోం: సుప్రీం - అమరావతి అంశంలో స్టేటస్​కో కుదరదన్న సుప్రీం

Supreme Court upholds status quo in Amaravathi case
అమరావతి అంశంలో స్టేటస్​కో రద్దు కుదరదన్న సుప్రీంకోర్టు
author img

By

Published : Aug 26, 2020, 11:50 AM IST

Updated : Aug 26, 2020, 6:31 PM IST

11:46 August 26

రాష్ట్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టులో విచారణ త్వరగానే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేసింది.

 మూడు రాజధానుల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోనూ భంగపాటు తప్పలేదు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో విధించగా.. దాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చట్టాల అమలుకు హైకోర్టు విధించిన స్టేటస్ కో అడ్డువస్తుందని.. దాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్​ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో రద్దు చేయడం కుదరదని తేల్చి చెప్పింది.  

మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం...

హై కోర్టులో జరుగుతున్న విచారణ మధ్యలో జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టులో ప్రోసిడింగ్స్ పూర్తి కాకుండానే మధ్యంతర ఉత్తర్వులపై తాము ఆదేశాలు ఇవ్వబోమని చెబుతూ పిటిషన్ కొట్టేసింది. ఈ కేసు విచారణలో ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ​ రాకేశ్ ద్వివేది, నాధకర్నీ, ​ నిరంజన్ రెడ్డి,  అమరావతి జేఏసీ, రైతుల తరఫున సీనియర్ న్యాయవాదులు నారీమన్, రంజిత్ కుమార్, శ్యాందివాస్, నిరజ్ కిషన్ పాల్ వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను రద్దు చేయలేమని జస్టిస్ అశోక్ భూషణ్ స్పష్టం చేయగా.. ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది హైకోర్టులో రోజువారీ విచారణతో నిర్ణీత కాలపరిమితిలో కేసును ముగించేలా హైకోర్టుకు సూచించాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసన.. హైకోర్టు త్వరగానే ఈ కేసు విచారణ ముగిస్తుందని నమ్ముతున్నామని.. అలాగని ప్రత్యేక ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది.

ఎందుకంత తొందర

పాలనా వికేంద్రీకరణలో శాసన, న్యాయ రాజధాని విషయంలో స్టేటస్ కో ఉన్నా.. కనీసం పరిపాలన విభాగాన్ని విశాఖ తరలించేలా మధ్యంతర ఉత్తర్వుల ఇవ్వాలని ఏపీ తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది సుప్రీంకోర్టును కోరినట్లు తెలిసింది.  ఈ విషయంలో అందుకు తాము ఇప్పుడు అనుమతి ఇచ్చినా... హైకోర్టు విచారణలో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తే తరలించిన వాటిని తిరిగి తేవడానికి ఎంత ప్రజాధనం వృథా అవుతుందని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు నెలలు ఎందుకు ఆగలేక పోతున్నారని.. అంత తొందరపాటు దేనికని సుప్రీంకోర్టు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

పాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వివరిస్తూ.. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జస్టిస్ అశోక్ భూషణ్  న్యాయ రాజధానిపై స్పందిస్తూ హైకోర్టు తరలింపుపై మీరు నిర్ణయం తీసేసుకున్నారా?.. మీ నిర్ణయంతోనే హైకోర్టు తరలింపు సాధ్యమేనా అని ప్రశ్నించారు. కేవియట్ దాఖలు చేసిన అమరావతి రైతుల తరఫున న్యాయవాది రంజిత్ కుమార్ వాదిస్తూ... ఏపీ విభజన చట్టంలో ఒకే రాజధాని అని పేర్కొన్న విషయాన్ని, భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వ హామీలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఆందోళన, మౌలిక వసతులు కలిగిన అమరావతిని రాజధానిగా కొనసాగించాలని న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు.  

పిటిషన్ కొట్టివేత

రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ముందుకు వెళ్తోందని.. అమరావతిలో హైకోర్టు ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తున్నారని కోర్టుకు సీనియర్ న్యాయవాది నారీమన్ సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. రాష్ట్రపతి ఉత్తర్వులపై అసెంబ్లీలో ఎలా చట్టం చేస్తారని నారీమన్ కోర్టు దృష్టికి తీసువచ్చారు. నారీమన్ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు... రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను తొసిపుచ్చింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని... హైకోర్టులో త్వరగానే కేసు విచారణ ముగిస్తారని భావిస్తున్నామని ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేసింది.  

హైకోర్టులో గురువారం రాజధాని కేసు విచారణలో.. ఉన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. హైకోర్టులో జరగబోయే విచారణపై ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి: 

ఏఎంఆర్‌డీఏ కార్యాలయ ముట్టడికి అమరావతి రైతుల యత్నం

Last Updated : Aug 26, 2020, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.