ETV Bharat / city

గవర్నర్​ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం - నిమ్మగడ్డ కేసు వార్తలు

supreme-court-refuses-to-stay-on-high-court-order-in-nimmagadda-ramesh-kumar-case
గవర్నర్​ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం
author img

By

Published : Jul 24, 2020, 12:23 PM IST

Updated : Jul 24, 2020, 7:28 PM IST

07:15 July 24

గవర్నర్​ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిమ్మగడ్డ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో ప్రతి విషయం తమకు తెలసన్న సీజేఐ... కావాలనే స్టే ఇవ్వట్లేదన్నారు. గవర్నర్ లేఖ పంపినా నిమ్మగడ్డ రమేశ్ కుమార్​కు పోస్టింగ్ ఇవ్వకపోవడం అత్యంత దారుణంగా అభివర్ణించారు.

ప్రతి విషయం తెలుసు..    

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ప్రతి విషయం మాకు తెలుసు. మేం ఈ కేసులో స్టే ఇవ్వలేం. గవర్నర్‌ లేఖ పంపినా పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అత్యంత దారుణం.- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే 

నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది శ్యామ్‌దివాన్‌ కోరారు. అదే సమయంలో రమేశ్​‌ కుమార్‌ తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే జోక్యం చేసుకుని.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఆతర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టారీతిలో మలుచుకుని వ్యవహరిస్తోందన్నారు. ఈ కేసులో రమేష్‌ కుమార్‌ని తిరిగి నియమిస్తే.. తాము వేసిన కేసు రద్దై పోతుందని ప్రభుత్వం చెప్పుకొస్తోందన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వక పోయినా.. కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని హరీశ్‌ సాల్వే వివరించారు. 

కోర్టు ధిక్కరణే..!

ఇరుపక్షాల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌.ఎ.బాబ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో స్టే ఇవ్వట్లేదన్నారు. గవర్నర్‌ లేఖ పంపినా రమేష్‌ కుమార్‌కు పోస్టింగ్‌ ఇవ్వకపోవడం, కోర్టులతోనే కాకుండా.. గవర్నర్‌తో కూడా చెప్పించుకోవాలా అని సీజేఐ వ్యాఖ్యానించారు. గతంలో నిమ్మగడ్డ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించామని సీజేఐ గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే... అది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని సీజేఐ అన్నారు.

ఈ సందర్భంలో హరీష్‌ సాల్వే మరోసారి జోక్యం చేసుకుంటూ.. తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాలతో పాటు.. మీడియాలో కూడా న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, కోర్టు ఉత్తర్వులపై ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని ధర్మాసనానికి తెలిపారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను కరోనా రోగులతో కలిపి గదిలో బంధించాలని పలువురు నేతలు వ్యాఖ్యానించారన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలతో పాటు.. హైకోర్టు తీర్పు తర్వాత పరిణామాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని హరీష్‌ సాల్వేని ఆదేశించింది. కేసు విచారణను వారం రోజులు వాయిదా వేసింది.

తాజాగా మరోసారి సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో నిమ్మగడ్డను ఎస్ఈసీగా పునరుద్ధరించడంపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందోనన్న ఆసక్తి నెలకొంది.

అసలు ఏం జరిగిందంటే..?

పూర్వ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్​ను హైకోర్టులో దాఖలు చేశారు. తన నియామకంపై అత్యున్నత న్యాయస్థానం మే 25 న ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయట్లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిన అధికార యంత్రాంగమే బేఖాతరు చేస్తున్నట్లు పిటిషన్​లో పేర్కొన్నారు. తన వ్యవహారంలో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు అమలుకాకపోవటం, అధికారుల వ్యవహారశైలిని పిటిషన్​లో ప్రస్తావించారు. తన స్థానంలో ప్రభుత్వం కొత్తగా నియమించిన జస్టిస్ కనగరాజ్​ కోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎస్​ఈసీగానే వ్యవహరిస్తున్నారని తెలిపారు. అలాగే.. ఎస్​ఈసీ​ రవాణా కోసం కేటాయించిన వాహనాన్ని ఇప్పటికీ కనగరాజ్​ పరిధిలోనే ఉంచటం సమంజసం కాదని వివరించారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు.కోర్టు ఆదేశాల అమలును జాప్యం చేయడంపై రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్ హరిచందన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో పాటు ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణిమోహన్​ దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే కోర్టులో నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ ప్రభుత్వంపై ధిక్కరణ పిటిషన్ వేశారు.

రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

 'రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను నియమించాలని ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ'... నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా కొనసాగించాలన్న తమ తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మూడుసార్లు నిరాకరించినా... ఎందుకు ఆయనను నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. మరోవైపు తన పునఃనియామకంపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించాలని రమేష్‌కుమార్‌కు కూడా కోర్టు సూచించింది. 

సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నిలుపుదలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై ఇవాళ విచారించిన అత్యున్నత ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేకు నిరాకరిస్తూ ఇస్తూ...తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చదవండి:

'కోర్టు తీర్పును ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తోంది'

Last Updated : Jul 24, 2020, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.