ETV Bharat / city

ఎల్జీ పాలిమర్స్ కేసు: హైకోర్టు తీర్పుపై 'స్టే'కు సుప్రీం నిరాకరణ

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ ఉదయ్, జస్టిస్ ఉమేశ్, జస్టిస్ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. ప్లాంట్​ను సీల్ చేసే అంశంపై జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు.. హైకోర్టులో పెండింగ్​లో ఉన్న పిటిషన్లను త్వరగా పరిష్కరించాలని సూచించింది.

supreme-court-refuses-to-pass-judgment-on-high-court-orders-in-case-of-lg-polymers-vishakhapatnam
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
author img

By

Published : Jun 15, 2020, 11:40 PM IST

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్​ను సీజ్ చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎల్జీ పాలిమర్స్ సంస్థ.. సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ ఉదయ్, జస్టిస్ ఉమేశ్, జస్టిస్ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

సంస్థ డైరెక్టర్ల పాస్ పోర్టులు జమ చేయాలని అనడం, ప్లాంట్​ను సీల్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని రోహత్గీ వాదించగా.. ఆయన వాదనలతో ధర్మాసనం విభేదించింది. ఈ సమయంలో ప్లాంట్ సీల్ చేయడంపై జోక్యం చేసుకోలేమన్న సర్వోన్నత న్యాయస్థానం... రాష్ట్ర హైకోర్టులో పెండింగ్​లో ఉన్న పిటిషన్ల విచారణను వీలైనంత త్వరగా విచారించేలా సూచిస్తామని చెప్పారు.

వచ్చే వారం చివరినాటికి ఎల్జీ పాలిమర్స్ సంబంధిత పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగించేలా చూడాలని సుప్రీంకోర్టు.. హైకోర్టుకు సూచించింది. మరోవైపు కేసును సుమోటోగా తీసుకునే అధికారం ఉందని.. ఇప్పటికే ఎన్జీటీకి తన ఆదేశాల్లో స్పష్టం చేసిందని.. అసలు వాదనలో ఉన్నట్లుగా ఎన్జీటీ ఆదేశాలను సవాలు చేసే అప్లికేషన్​ను సమర్పించాలని పిటిషనర్​కు కోర్టు సూచించింది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ జమ చేసిన 50 కోట్ల రూపాయలను పంపిణీ చేయాలన్న ఎన్జీటీ ఆదేశాలను మాత్రం 10 రోజులు నిలుపుదల చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి..

ఈ టెస్ట్‌ కిట్‌తో 30 నిమిషాల్లోనే కరోనా ఫలితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.