ETV Bharat / city

'షెడ్యూల్డ్ ప్రాంతాల్లోనూ రిజర్వేషన్లు 50శాతం మించరాదు' - షెడ్యూల్డ్ రిజర్వేషన్లు లేటెస్ట్ న్యూస్

ఏపీ, తెలంగాణలు భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని, పరిమితికి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఉమ్మడి ఏపీలో షెడ్యూల్డు ఏరియాల్లో ఉపాధ్యాయుల పోస్టులను వందశాతం షెడ్యూల్డు తెగల(ఎస్టీ) అభ్యర్థులతో భర్తీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ చెబ్రోలు లీలా ప్రసాదరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. షెడ్యూల్డు ప్రాంతాల్లోనూ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme court on Reservations
'షెడ్యూల్డ్ ప్రాంతాల్లోనూ రిజర్వేషన్లు 50శాతం మించరాదు'
author img

By

Published : Apr 23, 2020, 7:53 AM IST

షెడ్యూల్డు ప్రాంతాల్లోనూ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీలో షెడ్యూల్డు ఏరియాల్లో ఉపాధ్యాయుల పోస్టులను వందశాతం షెడ్యూల్డు తెగల(ఎస్టీ) అభ్యర్థులతో భర్తీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ చెబ్రోలు లీలా ప్రసాదరావు దాఖలు చేసిన పిటిషన్‌పై... జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలో జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ అనిరుధ బోస్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వందశాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, షెడ్యూల్డు ఏరియాలో వందశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2000 సంవత్సరంలో అప్పటి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉమ్మడి హైకోర్టు సమర్థించడం తగదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సీఎస్‌ఎన్‌ మోహన్‌రావు వాదించారు. ఈ వాదనలతో రాజ్యాంగ ధర్మాసనం ఏకీభవించింది. ఆ జీవోను కొట్టి వేసింది. వంద శాతం రిజర్వేషన్లను రాజ్యాంగం అనుమతించదని స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1986లోనూ ఈ తరహా జీవోను విడుదల చేసిందని, దాన్ని రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ కొట్టివేసిందని ధర్మాసనం ప్రస్తావించింది. కొన్నేళ్ల తర్వాత అదే తరహా జీవోతో రాజ్యాంగ విరుద్ధ ప్రయత్నం చేయడం సరికాదని పేర్కొంది. నాడు జరిగిన నియామకాల్లో ఎలాంటి జోక్యం చేసుకోబోమని చెబుతూనే... ఏపీ, తెలంగాణలు భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని, పరిమితికి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఒకవేళ రిజర్వేషన్ల పరిమితిని అతిక్రమిస్తే 1986 నుంచి ఇప్పటిదాకా చేసిన నియామకాలను కాపాడలేమని చెప్పింది. కేసు ఖర్చుల కింద రూ.5లక్షలు చెల్లించాలని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఈ మొత్తాన్ని చెరిసగం భరించాలని ఆదేశించింది.

ఇవీ చూడండి-'చావుకీ.. బతుక్కీ మధ్య నలిగిపోతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.