రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై దాఖలైన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్న జరిగిందో లేదో తేలుస్తామంటూ రాష్ట్ర హైకోర్టు... ఓ హెబియస్ కార్పస్ పిటిషన్ల విచారణలో ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా.. అఫిడవిట్ దాఖలుకు ప్రతివాదుల తరపు న్యాయవాది సమయం కోరారు. అంగీకరించిన సీజేఐ ధర్మాసనం రెండు వారాలకు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ పిటిషన్ పై గత విచారణలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.
ఇదీ చదవండి