ETV Bharat / city

తెలంగాణ: రాత్రి 8-10 వరకు 'గ్రీన్‌ టపాసులు' కాల్చేందుకు అవకాశం

తెలంగాణలో బాణసంచా నిషేధం అంశంలో సుప్రీంకోర్టు కాస్త సడలింపు ఇచ్చింది. గాలి నాణ్యత సాధారణ స్థితిలో ఉంటే అలాంటి ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టపాసులు కాల్చుకునేందుకు ఎన్జీటీ అనుమతించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఎన్జీటీ ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

author img

By

Published : Nov 13, 2020, 4:14 PM IST

supreme court
supreme court

బాణసంచా నిషేధం అంశంలో తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌కు స్వల్ప ఊరట లభించింది. బాణసంచాను నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. గాలి నాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసం విచారణ చేపట్టింది. ఈనెల 9న జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ఆదేశాలను సవరిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా గాలి నాణ్యత ఆధారంగా టపాసుల కాల్చివేత, విక్రయాలకు అనుమతివ్వాలని ఇటీవల ఎన్జీటీ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై పూర్తిగా నిషేధం విధించింది. గాలి నాణ్యత సాధారణ స్థితిలో ఉంటే అలాంటి ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టపాసులు కాల్చుకునేందుకు ఎన్జీటీ అనుమతించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఎన్జీటీ ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అధిక కాలుష్య ప్రాంతాల్లో బాణసంచాను పూర్తిగా నిషేధించింది. దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు ఇవే ఆంక్షలు వర్తించనున్నాయి.

ఫైర్‌వర్క్స్​ డీలర్స్ సంఘం పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం.. తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది.

ఇవీ చూడండి: బాణసంచాపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.