కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ఉపసంహరణకు (Telangana petition over krishna river water )సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కృష్ణా జలాల పంపకంపై గతంలో కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ట్రైబ్యునల్ కోసం సుప్రీంను తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది.
అయితే గతంలో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జరిగిన భేటీలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకుంటేనే.. కొత్త ట్రైబ్యునల్ (krishna tribunal )ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ సూచనకు అంగీకరించిన తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరణకు దేశ అత్యన్నత న్యాయస్థానాన్నిఅనుమతి కోరింది. దీనిపై ఇవాళ విచారణ జరిగింది.
పిటిషన్ ఉపసంహరణపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్పందించిన సుప్రీం.. తాము ట్రైబ్యునల్ ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ఆదేశాలు ఇవ్వట్లేదని స్పష్టం చేసింది. పిటిషన్ ఉపసంహరణపై అభ్యంతరాల దాఖలుకు తమకు అవకాశం ఇవ్వాలని ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు న్యాయస్థానాన్ని కోరాయి. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.