కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల అమలు అసాధ్యమని... సుప్రీంకోర్టు న్యాయవాది మట్టెగుంట రామకృష్ణ తెలిపారు. శాసన, న్యాయ రాజధానులు అని అని ఎక్కడా పిలవరని... కార్యనిర్వాహక రాజధానినే రాజధాని అంటారని వ్యాఖ్యానించారు. రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన తరుణంలో అమరావతి రాజధాని ప్రాంత రైతులు సుప్రీంకోర్టు న్యాయవాది రామకృష్ణను సంప్రదించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలు... మూడు రాజధానుల చట్టంలోని విషయాలపై రైతులతో చర్చించారు.
రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని... కానీ చట్టంలో ఎక్కడా రిలోకేషన్ అని అనలేదని తెలిపారు. విశాఖలో రాజధాని ఉండాలి అంటే అమరావతి నుంచి రీలోకేట్ చేయాలని తెలిపారు. రాజధాని తరలింపు అని చెప్పకుండా రాష్ట్ర పరిధిలో లేని అంశాలను ఈ చట్టంలో పొందుపరిచారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒకేచోట రాజధాని ఉంచాలని 94(3)లో ఉందని తెలిపారు. చట్టంలో అన్నీ కూడా ఒకేచోట ఉండాలని చెప్పారన్నారు. న్యాయ, పరిపాలన, శాసన రాజధానులను వేరు చేయడానికి విభజన చట్టం అంగీకరించబోదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి