ETV Bharat / city

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు - వ్యవసాయ చట్టాలు న్యూస్

రైతాంగం నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులు దిల్లీలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. వీరికి మద్ధతుగా రైతు సంఘాలు, వామపక్షాలు, రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను దిగ్బంధించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Statewide protests against agricultural laws
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
author img

By

Published : Feb 6, 2021, 7:45 PM IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు, వామపక్షాలు, రైతు సంఘాలు ఆందోళనలను చేపట్టారు. ఈ సందర్భంగా దిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు మద్ధతు తెలిపారు.

కృష్ణా జిల్లాలో..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. నందిగామలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్ధతు తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గుంటూరు జిల్లాలో..

దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా.. చుట్టుగుంట సెంటర్, పిడుగురాళ్లలో వామపక్షాలు, రైతు సంఘ నాయకులు, రైతులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ చట్టాల వల్ల దేశంలోని రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా మారనుందని అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తణుకులో వామపక్షాలు ఉద్యమించాయి. వెంకటేశ్వర టాకీస్ కూడలిలోని ప్రధాన రహదారిపై సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతపురం జిల్లాలో..

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. కనగానపల్లి మండలం ముక్తాపురం జాతీయ రహదారిపై రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. దిల్లీ రైతులకు మద్ధతుగా చేపట్టిన ఈ నిరసనలో సీపీఎం సీనియర్ నాయకుడు ఓబులు పాల్గొన్నారు.

నెల్లూరులో..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. దిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు మద్ధతుగా అయ్యప్ప గుడి సెంటర్ వద్ద.. రైతులు మూడు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలలో మార్పులు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిచ్చారు.

ప్రకాశం జిల్లాలో..

దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్ధతుగా ఒంగోలు బస్టాండ్‌ వద్ద.. రైతు సంఘాలు, రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులతో చర్చలు జరిపి.. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతు సంఘాల ప్రతినిధులు కోరారు.

కర్నూలు జిల్లాలో..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. రైతు సంఘల ఆద్వర్యంలో రైతులు కర్నూలులోని జాతీయ రహదారి, నూనెపల్లెలో రోడ్లను దిగ్బంధం చేశారు. రైతులకు నష్టం కలిగించే నూతన చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేంత వరకు ఆందోళనలను కొనసాగిస్తామని రైతు సంఘం నాయకులు తెలిపారు.

ఇదీ చదవండి:

ఎన్నికల అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.