ETV Bharat / city

క్వారంటైన్​లో ఉంటాం...మౌంట్ అబూ నుంచి తీసుకెళ్లండి..!

క్వారంటైన్​లో ఉండటానికి సిద్దమేనని...తమను స్వగ్రామాలకు చేర్చాలని రాజస్థాన్​లోని మౌంట్ అబూలో చిక్కుకున్న రాష్ట్ర యాత్రికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

State travelers struck in Mount Abu
మౌంట్ అబూలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
author img

By

Published : Apr 30, 2020, 10:04 AM IST

తమను తమ గ్రామాలకు చేరిస్తే అక్కడ క్వారంటెయిన్‌లో ఉండటానికీ సిద్ధమని..వెంటనే తమను స్వగ్రామాలకు చేర్చాలని రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూలో చిక్కుకున్న రాష్ట్ర యాత్రికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు 400 మంది అక్కడ ఉన్నారు. నిజానికి వారంతా మార్చి 23వ తేదీకి తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్లు చేయించుకున్నారు. లాక్‌డౌన్‌తో రైళ్లు ఆగిపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.

‘‘మార్చి 18న ఓం శాంతి ఆశ్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనేక రాష్ట్రాల నుంచి మౌంట్‌ అబూకు ఎందరో భక్తులం వచ్చాం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రభుత్వాలు వారి రాష్ట్రాలకు చెందిన వారిని బస్సుల్లో స్వస్థలాలకు తీసుకువెళ్లిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారమే ఇక్కడ నెలరోజులుగా ఉండిపోయాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించి బస్సులు ఏర్పాటు చేసి మమ్మల్ని స్వంత గ్రామాలకు తీసుకువెళ్లాలి’’ అని ఓం శాంతి భక్తులు ఈనాడు ప్రతినిధి వద్ద పేర్కొన్నారు. తన కుమార్తెకు కాన్పు సమయం దగ్గరపడుతోందంటూ పేరుపాలెంకు చెందిన కొప్పుల గంగారత్నం ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలం బయటకు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నామని ఏలూరుకు చెందిన మరో మహిళ ఆవేదన తెలిపారు. చిక్కుకున్నవారిలో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు, నరసాపురం, ఏలూరు మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని కోనసీమ మండలాలు, విశాఖ జిల్లా, తెలంగాణలోని వరంగల్‌ జిల్లాకు చెందిన పురుషులు, మహిళలు దాదాపు 400 మంది ఉన్నారు.

ఇవీ చదవండి...స్వస్థలాలకు వెళ్లేందుకు.. కేంద్రం మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.