ETV Bharat / city

రూ. 4,200 కోట్లతో రహదారుల విస్తరణకు ప్రభుత్వం భారీ ప్రణాళిక..

రాష్ట్రంలోని రహదారుల నెట్వర్క్​ను డబుల్ లైన్​గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం న్యూ డెవలప్​మెంట్​ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర హైవేలలో 1600 కిలోమీటర్ల మేర డబుల్ లైన్​గా మార్చడంతో పాటు.. 1400 కిలోమీటర్ల గ్రామీణ ప్రాంతాలను మండలకేంద్రాలతో అనుసంధానం చేసేందుకు మరో ప్రాజెక్టును చేపట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం మొత్తం రూ.4,200 కోట్ల మేర ఆర్థిక సహకారాన్ని న్యూ డెవలప్​మెంట్​ బ్యాంక్ అందించనుంది.

mou by governament
రహదారుల విస్తరణకు ప్రభుత్వం భారీ ప్రణాళిక
author img

By

Published : Jan 7, 2021, 7:08 PM IST

రోడ్ల విస్తరణకు ప్రాజెక్టు:

రాష్ట్రంలో రహదారులను డబుల్ లైన్​గా మార్చేందుకు గ్రామీణ ప్రాంతాలను, మండల కేంద్రాలతో అనుసంధానం చేసేందుకు రెండు వేర్వేరు ప్రాజెక్టులను రాష్ట్రప్రభుత్వం చేపట్టనుంది. ఇందుకోసం న్యూ డెవలప్​మెంట్​ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. 1600 కిలోమీటర్ల మేర రాష్ట్ర హైవేలను డబుల్​లైన్​గా మార్చడంతో పాటు.. గ్రామీణ ప్రాంతాలను మండల కేంద్రాలతో అనుసంధానం చేసే ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

రాష్ట్ర రహదారులకు రూ.2,100 కోట్ల కేటాయింపు :

రూ.2,100 కోట్లు చొప్పున రెండు వేర్వేరు ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఒప్పందం కుదిరింది. రాష్ట్ర రహదారుల నెట్వర్క్ లోని 1600 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ వేయడం, దెబ్బతిన్న వంతెన మార్గాల అభివృద్ధి కోసం ఈ మెుత్తాన్ని ఖర్చు చేయనున్నారు.

గ్రామీణ ప్రాంతాలను మండల కేంద్రాలతో అనుసంధానం:

రెండో ప్రాజెక్టుగా గ్రామీణ ప్రాంతాలను మండల కేంద్రాలకు అనుసంధానం చేసేందుకు 1400 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం డబుల్ లేన్ కోసం, అలాగే దెబ్బతిన్న వంతెనలను బాగు చేసేందుకు మరో రూ.2,100 కోట్ల రుణాన్ని న్యూ డెవలప్​మెంట్​ బ్యాంక్ అందించేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఏపీ రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు, కేంద్ర ప్రభుత్వం తరఫున బలదేవ్ పురుషార్ధ సంతకాలు చేశారు. మొత్తం 32 ఏళ్లలో రెండు రుణాలను తీర్చేందుకు న్యూ డెవలప్​మెంట్​ బ్యాంకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న రుణానికి ఐదేళ్లపాటు చెల్లింపులపై మారటోరియం లభిస్తుందని ఒప్పందంలో పేర్కొంది.

టోల్ వసూలుతో ఆదాయం:

రాష్ట్రంలోని వేర్వేరు రహదారులను డబుల్ లైన్ చేయడం ద్వారా 15 వేల వాహనాల రాకపోకలకు వీలు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ రహదారుల నుంచి టోల్ వసూలు ద్వారా కొంత మొత్తం ఆదాయాన్ని ఆర్జించవచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని డబుల్ లేన్ మార్గాల్లో టోల్ గేట్లను ఏర్పాటు చేసి వాహన రాకపోకలకు రుసుము వసూలు చేయాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి:

వ్యాక్సిన్​ వచ్చేస్తోంది.. సిద్ధంగా ఉండండి: కేంద్రం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.