ETV Bharat / city

సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై... సస్పెన్షన్‌ ఎత్తివేత

AB VENKATESWARA RAO
సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేత
author img

By

Published : May 18, 2022, 11:09 AM IST

Updated : May 18, 2022, 2:13 PM IST

11:04 May 18

సర్వీసులోకి తిరిగి తీసుకుంటూ ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం

AB VENKATESWARA RAO: ఐపీఎస్​ సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసు పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని సూచించింది.

ఏబీవీని రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్‌ చేసింది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ... ప్రభుత్వం అప్పట్లో చర్యలు తీసుకుంది. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఏబీవీ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది.

ఏబీవీ సస్పెన్షన్‌ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 7తో ముగిసినందున ఇకపై సస్పెన్షన్‌ చెల్లదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఏబీవీ సర్వీసులో ఉన్నట్లు గుర్తించి ఆయనకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు కల్పించాలని పేర్కొంది. సుప్రీం ఆదేశాలతో...ఏబీవీపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి:

సీఎస్‌ సమీర్​ శర్మను కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎంతకాలం? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Murder: పిఠాపురంలో దారుణం... అత్తను నరికి చంపిన అల్లుడు

రాష్ట్రంలో 250కిపైగా పని చేయని పథకాలు... ఆ సమస్యలే ప్రధాన కారణం !

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన దీపికా పదుకొణె, తమన్నా

Last Updated : May 18, 2022, 2:13 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.