రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం హైదరాబాద్లోని ఇందిరాభవన్‌లో జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ, ఏపీపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్, కార్యనిర్వహక అధ్యక్షులు డాక్టర్ ఎన్ తులసి రెడ్డిలతోపాటు పలువురు కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ వైఖరిపై ప్రధానంగా చర్చించి ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి పంథా అనుసరించాలి, అందుకోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశాలను చర్చించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ఎవరిని భాగస్వామ్యం చేయాలి వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...