ETV Bharat / city

సర్వర్ల హ్యాకింగ్​కు చైనా యత్నం : టీఎస్​ ట్రాన్స్‌కో- జెన్‌కో సీఎండీ - transco cmd prabhakar rao latest news

సర్వర్ల హ్యాకింగ్​కు చైనా యత్నం చేశారని కేంద్రం తెలిపినట్లు తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్​కో సీఎండీ ప్రభాకర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రిడ్ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు వివరించారు.

transco cmd prabhakar rao
transco cmd prabhakar rao
author img

By

Published : Mar 2, 2021, 9:34 PM IST

తెలంగాణ సర్వర్లపై చైనా హ్యాకర్లు హ్యాకింగ్‌ యత్నం చేశారని కేంద్రం తెలిపినట్లు ట్రాన్స్‌కో - జెన్​కో సీఎండీ ప్రభాకర్‌రావు ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్‌ ప్రసార వ్యవస్థను ప్రభావితం చేసే యత్నం జరిగినట్లు కేంద్రం సమాచారం ఇచ్చిందని ఆయన అన్నారు. కొన్ని సబ్‌ స్టేషన్లలో థ్రెట్‌ యాక్టర్‌ ప్రవేశించినట్లు తెలుస్తోందన్న సీఎండీ... కేంద్ర సమాచారంతో సాంకేతిక విభాగం అప్రమత్తమైందని వివరించారు.

గ్రిడ్ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించి ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్‌శాఖ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు.

ఇదీ చదవండి:

కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.