ETV Bharat / city

జంక్​ఫుడ్​తో జర జాగ్రత్త... - obesity in children news

యాంత్రిక జీవితం.. మారిన జీవనశైలి.. చిరుతిండ్లు.. పిల్లల ఎదుగుదలపై పెద్దల్లో అశ్రద్ధ.. బాల్యాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. బొద్దుగా ఉండి ముద్దొస్తున్నాడే అంటే పిల్లల్ని చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. కానీ ఆ బరువుతో పాటు పెరిగే సమస్యల్ని వారు గుర్తించ లేకపోతున్నారు. గతంలో 40, 50 ఏళ్లకు ఊబకాయం సమస్య వచ్చేది. ఇప్పుడు నాలుగైదేళ్ల వయసు నుంచే ఇది చుట్టుముడుతోంది. నగరాలు.. పట్టణాల్లో నివసించే పిల్లల్లో ఊబకాయం ఎక్కువగా ఉంది. వయసు.. ఎత్తుకు తగ్గట్లుగా ఉండాల్సిన బరువుపై శ్రద్ధ లోపించడమే అసలు సమస్యగా మారుతుంది. ఎన్నో నివేదికలు చిన్నారుల్లో స్థూలకాయం గురించి హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి.

child fat
బాల్యంలోనే ఊబకాయులు
author img

By

Published : Dec 24, 2020, 5:02 PM IST

అతి ప్రేమ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటారులే అన్న గారాబం. పిల్లలు తొందరగా ఎదగాలన్న ఆశ. ఆరోగ్యంగా ఉండాలన్న ఆరాటం. ఇవన్నీ తల్లిదండ్రుల్లో కనిపించేవే. అవి సహజం కూడా. కానీ... మోతాదు మించటం వల్లే సమస్యలన్నీ. పిల్లలు ఏది కోరుకుంటే అది ఇవ్వాలనుకోవటం మంచిదే అయినా... ఆహారం విషయంలో ఇది శ్రుతి మించుతోంది. ఏది మంచి ఏది చెడు అన్న ఆలోచన లేకుండానే పిల్లలకు నచ్చింది పెడుతున్నారు. ఫలితంగా.. వారు వయసుకి మించి బరువు పెరుగుతున్నారు. ఈ మాత్రం బొద్దుగా ఉండకూడదా ఏమిటి..? అనుకుని మొదట్లో నిర్లక్ష్యం వహిస్తారు పెద్దలు. అదే.. క్రమంగా చిన్నారుల్లో అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. పట్టుమని పదేళ్లు నిండకుండానే.. ఊబకాయులవుతున్నారు.

  • పెద్దయ్యాక సమస్యలు

శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి హాని చేసే వ్యాధే... ఈ ఊబకాయం. తీపి పదార్థాలు, జంక్‌ఫుడ్‌. చిన్నారుల్లో స్థూలకాయానికి ఇవే కారణం. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం లాంటి కారణాలతో పాటు... కొన్నిసార్లు వారసత్వం వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడుతున్న చిన్నారులున్నారు. అంటే ఒక వ్యక్తి తన ఎత్తు, వయస్సుకు తగ్గట్లుగా ఉండాల్సిన బరువుకు మించితే అది అనారోగ్య సమస్యగా గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నిద్రలో సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం, కీళ్లకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల కేన్సర్‌ వ్యాధులూ వచ్చే ప్రమాదముంది. అక్కడితో ఆగకుండా వారు పెద్దయ్యాక అనేక రోగాలకు కారణమవుతోందని పరిశోధనల్లో తేలింది.

  • శారీరక శ్రమ లేకపోవడం

కొన్ని నివేదికలు ఇప్పటికే ఈ సమస్యపై దృష్టి సారించాలని అన్ని ప్రభుత్వాలను హెచ్చరించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్ని దేశాలనూ అప్రమత్తం చేసింది. చిన్నారుల్లో ఊబకాయం సమస్య ఎక్కువగా ఉన్న భారత్‌లోనూ నిర్లక్ష్యం తగదని వారించింది. ఈ క్రమంలోనే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-ఎన్​ఎఫ్​హెచ్​ఎస్​ ఇటీవల చేసిన అధ్యయనం... దేశంలో చిన్నారుల్లో ఈ ముప్పు ఎంతగా పొంచి ఉందో తేల్చి చెప్పింది. మొత్తం 20 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఊబకాయం అనూహ్యంగా పెరిగినట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. తగినంత శారీరక శ్రమ లేకపోవటం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోవటం ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. తొలిదశలో 17 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అధ్యయన ఫలితాలు వెల్లడించింది.

  • అనేక వ్యాధులకు దారి తీస్తోంది

ఈ అధ్యయనంలో...పిల్లల్లో ఎత్తు, బరువుకు అనుగుణంగా ఊబకాయం ఎలా ఉందో లెక్కించారు. గతంలో చేపట్టిన సర్వేతో పోల్చితే... మహారాష్ట్ర, గుజరాత్, మిజోరం, త్రిపుర, లక్షద్వీప్ సహా జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లోనూ పిల్లల్లో ఊబకాయం అధిక శాతం పెరిగింది. నిజానికి ఈ సమస్య భారత్‌లో 4 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇదే విషయాన్ని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్​ఓ కూడా తేల్చి చెప్పింది. ఏటా చిన్నారుల్లో ఊబకాయుల సంఖ్య పెరుగుతూ పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ ప్రకారం... భారత్‌, చైనా, అమెరికాలో మరో దశాబ్ద కాలంలో చిన్నారుల్లో ఊబకాయుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరనుంది. అంటే... 2030 నాటికి భారత్‌లో ఈ సమస్య తీవ్రత పెరగనుంది. పెద్దవాళ్లలో కనిపించే మధుమేహం, రక్తపోటు, అధిక కొవ్వు లాంటి జబ్బులు... ఊబకాయం కారణంగా చిన్నారుల్లోనూ కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

  • తీవ్రమవుతోన్న ఈ సమస్య

భారత్‌లోని పాఠశాలల్లో 5-8% మంది పిల్లల్లో ఊబకాయం కనిపిస్తోంది. ఇదిలాగే కొనసాగితే.. 2030 నాటికి చిన్నారుల ఊబకాయం విషయంలో చైనా తరవాత రెండో స్థానంలో నిలుస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు.. నిపుణులు. అప్పటికి చిన్నారుల్లో ఊబకాయ బాధితుల సంఖ్య 2 కోట్ల 70 లక్షలు దాటుతుందని అంచనా. ఊబకాయం, మధుమేహం... ఈ రెండు వ్యాధులను వీలైనంత త్వరగా నియంత్రించాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ విషయంలో భారత్‌ వెనుకంజలోనే ఉంటోంది. పిల్లలు టీవీ ముందు కూర్చొని చిరుతిళ్లు ఎక్కువగా తింటుంటారు. ఈ పద్ధతిని మాన్పించాలని వైద్యులు ఎంత చెబుతున్నా... తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు. అందుకే... అంతటా ఈ సమస్య తీవ్రమవుతోంది.

  • ఇంట్లోనే ఉంచడం వల్ల

ప్రతివ్యక్తి వయసు ఎత్తును బట్టి ఉండాల్సిన బరువు నిర్ధరిస్తారు. ఐదు కిలోలు ఎక్కువగా ఉన్నా పెద్దగా దిగులు పడాల్సిన పని లేదు. థైరాయిడ్‌ సమస్యలు ఉన్నవారు ఆకస్మికంగా బరువు పెరుగుతుంటారు. ఈ సమస్య కోసం వైద్యులను సంప్రదించడం తప్పనిసరి. అధికంగా తినడంవల్లే బరువు పెరుగుతున్నారని అందరూ అనుకుంటారు కానీ.. తిన్నది అరగకపోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. చాక్రిన్‌తో ఉన్న తీపి పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌ ఊబకాయానికి కారణమవుతున్నాయి. శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడంవల్లే కొవ్వు పేరుకుపోతోంది. అది క్రమక్రమంగా పెరిగి శరీర బరువును పెంచేస్తోంది. ఆ కొవ్వును తొలగించడం అంత సులువు కాదు. మరీ ముఖ్యంగా... చిన్నారుల్లో. ఐదేళ్ల లోపు పిల్లలు వ్యాయామం చేసే అవకాశం ఉండదు. కేవలం ఆటపాటలతోనే వారికి శారీరక శ్రమ కలుగుతుంది. కొందరు తల్లిదండ్రులు మరీ ముద్దు చేసి ఇంట్లోనే ఉంచటం వల్ల కూడా ఊబకాయం పెరుగుతోంది.

  • ఇలా చేయాల్సిందే...

చిన్నారులు ఊబకాయులుగా మారకుండా... అభివృద్ధి చెందిన దేశాలు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాయి. పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉన్న దేశాల్లోని ప్రజల ఆయుఃప్రమాణం పెరుగుతూ ఉంది. ఊబకాయం సమస్య తలెత్తాక బరువు తగ్గడం అంటే మహా కష్టంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సీజనల్‌గా లభించే పండ్లు చిన్నారులకు అలవాటు చేయాలి. పండ్లలో పీచు పదార్థం ఉంటుంది. ఫలితంగా బరువు పెరిగే సమస్య ఉండదు. సాధారణ పద్ధతుల్లో బరువు తగ్గాలంటే నడక, తోటపని, నృత్యం, యోగ, ప్రాణాయామం చేయవచ్చు. చిన్నారుల్లో ఊబకాయాన్ని తగ్గించేందుకు ఆహారంలో కోత బదులు శారీరక శ్రమ పెంచడం మేలు. ఒకేసారి కాకుండా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం అందించాలి. ఉదయంపూట ఎండలో వ్యాయామం చేయడంతో శరీరానికి అవసరం మేరకు డీ మిటమిన్‌ అందుతుంది. అది పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఇదీ చదవండి:

అధికార భాషగా తెలుగు.. ఆనందోత్సాహాల్లో ఖరగ్​పూర్​ వాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.