కరోనా మలిదశ కోసం రాష్ట్రవ్యాప్తంగా 17 వేల పడకలు సిద్ధం చేసినట్లు.. కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నోడల్ అధికారి ఆర్జా శ్రీకాంత్ వెల్లడించారు. కరోనా చికిత్స కోసం ప్రత్యేకించి 126 ఆస్పత్రులు సిద్ధం అయ్యాయని ఆయన తెలిపారు. వీటిలో 2 వేలకు పైగా వెంటిలేటర్లనూ అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ ఆస్పత్రులను గుర్తించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: 'రెమ్‌డెసివిర్‌ను బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలే'
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 7,535 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని శ్రీకాంత్ వివరించారు. 35,465 మంది హోమ్ ఐసోలేషన్‌లో వైద్య సేవలు పొందుతున్నట్లు స్పష్టం చేశారు. 1,686 మంది కొవిడ్ కేర్ కేంద్రాల్లో.. 3,665 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 5,963 కేసులు, 27 మరణాలు