ETV Bharat / city

మాస్క్​ ధరించని వారికి రూ.500 జరిమానా: దక్షిణ మధ్య రైల్వే - hyderabad latest news

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్​లు ధరించకుండా ప్రయాణించే వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు... దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

south central railway
మాస్క్​ ధరించని వారికి జరిమానా
author img

By

Published : Apr 18, 2021, 12:23 PM IST

రైలు ప్రయాణంలో మాస్క్​ ధరించని వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు... దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల అధికారి రాకేశ్​ స్పష్టం చేశారు. స్టేషన్​ పరిసర ప్రాంతాల్లో ఉమ్మి వేయడం, తదితర చర్యలకు పాల్పడిన వారికి సైతం ఈ జరిమానా వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

భారతీయ రైల్వే నిబంధన 2012 ప్రకారం నిబంధనలు పాటించని వారికి... రైల్వే అధికారులు జరిమానాలు విధిస్తారని పేర్కొన్నారు. ప్రయాణికులు కచ్చితంగా ముఖానికి మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. అందరూ బాధ్యతతో వ్యవహరించి కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించండి: వెంకట్రామిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.