ETV Bharat / city

ద.మ.రైల్వేలో 300 మరణాలు - కరోనా మహమ్మారి ప్రభావం

ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేస్తూ.. సరకులతో పాటు ప్రాణాధార ఆక్సిజన్‌ రవాణాకు ప్రత్యేక రైళ్లు నడుపుతూ కీలకంగా వ్యవహరిస్తున్న దక్షిణ మధ్య రైల్వేను కొవిడ్‌ మహమ్మారి వణికిస్తోంది. టికెట్‌ తనిఖీ అధికారులు, రైళ్లు నడిపే లోకో సిబ్బంది పెద్దసంఖ్యలో వ్యాధి బారిన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా జోన్‌ పరిధిలో రైల్వే ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి.

railway covid shock
railway covid shock
author img

By

Published : May 13, 2021, 9:46 AM IST

Updated : May 13, 2021, 1:24 PM IST

రైల్వే ఉద్యోగులు, పదవీ విరమణ పొందినవారు, కుటుంబ సభ్యులు కలిపి జోన్‌ పరిధిలో ఇప్పటివరకు 8,400 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఇందులో ఉద్యోగుల సంఖ్య సగానికి పైగా ఉంటుందని సమాచారం. బాధితుల్లో 3 వేల మంది చికిత్సకోసం ఆసుపత్రుల్లో చేరారు. 5,400 మంది హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందారు. 300 మంది మరణించారు. విజయవాడ డివిజన్‌ పరిధిలో ఏప్రిల్‌ 1 నుంచి 60 మందికి పైగా టికెట్‌ తనిఖీ అధికారులు కొవిడ్‌ బారిన పడగా.. వారిలో 10 మంది మరణించినట్లు సమాచారం.

ఓపీ సేవలు బంద్‌

  • సికింద్రాబాద్‌ లాలాగూడలోని ద.మ.రైల్వే సెంట్రల్‌ ఆసుపత్రిలో 300 పడకలు ఉండగా.. గత జూన్‌లో 100 బెడ్లను కొవిడ్‌ చికిత్సకు కేటాయించారు. ఏప్రిల్‌ నుంచి ఔట్‌పేషెంట్‌ సేవల్ని నిలిపివేసి.. కొవిడ్‌ పడకల సంఖ్యను క్రమంగా 250కి పెంచారు. మెట్టుగూడలో ‘రైల్‌కల్యాణ్‌’, మౌలాలి ఇరిసెట్‌ ప్రాంగణంలోని సూపర్‌వైజర్ల శిక్షణకేంద్రంలో 60 పడకలు ఏర్పాటుచేశారు. అయినా బెడ్ల కొరత వేధిస్తోంది. వ్యాధి తీవ్రంగా ఉన్నవారిని సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. పలువురు సొంత ఖర్చుతో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు.
  • ఏపీలోని విజయవాడ రైల్వే ఆసుపత్రిలో ఉన్న 220 పడకలు కొవిడ్‌ రోగులతో నిండిపోయాయి. సాధారణ రోగులను వార్డుల నుంచి ఆసుపత్రి భవనంలోని కార్యాలయ గదులకు మార్చారు. ఇక్కడ దాదాపు 20 మందికిపైగా టీటీఈలు కొవిడ్‌ చికిత్స పొందుతున్నారు.
  • గుంతకల్లు రైల్వే డివిజన్‌ ఆసుపత్రిలో 70 పడకలు ఉండగా 64 మంది కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్నారు.
  • వైద్యులపై ఒత్తిడి నేపథ్యంలో రైల్వే ఆసుపత్రుల్లో సేవలకు పారామెడికల్‌ సిబ్బందిని ఏడాది వ్యవధికి తాత్కాలికంగా తీసుకునేందుకు రైల్వే శాఖ నియామక ప్రక్రియ మొదలుపెట్టింది.

బండి ఎక్కాలంటే భయం..భయం

విధి నిర్వహణలో భాగంగా కేసులు అధికంగా ఉన్న పొరుగు రాష్ట్రాలకు వెళ్లి రావాలంటే లోకో సిబ్బంది, టీటీఈలు భయపడుతున్నారు. ‘భయంభయంగా బండి ఎక్కుతున్నాం. డ్యూటీ పూర్తయ్యి ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేక గదిలో ఉంటున్నాం’ అని ఓ రైల్వే ఉద్యోగి చెప్పారు.

ఇదీ చూడండి: కేజీహెచ్‌లో మృతుల బంధువుల ఆవేదన..

Last Updated : May 13, 2021, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.