మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం పొన్నాలలో మేలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బాలనర్సింహ అనే వృద్ధుడు మే 4న అగ్నిప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 6 న మరణించాడు. అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అసలు నిజం తెలిసింది. తమకు ఆస్తి ఇవ్వటం లేదన్న కోపంతో కొడుకు నర్సింహ, కోడలు జాంగిరమ్మ ఓ పథకం పన్నారు.
భయపడి ఉన్నదంతా చెప్పుకున్నారు...
మే నాలుగో తేదీ రాత్రి సమయంలో బాలనర్సింహ ఇంటి బయట పడుకోగా... దంపతులిద్దరూ కూడబలుక్కొని వృద్ధునిపై కిరోసిన్‌పోసి నిప్పంటించారు. బాలనర్సింహ కేకలు వేయగా... మంటలు ఆర్పుతున్నట్లు నటించి, స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు 6న మరణించాడు. ఆస్పత్రిలో బాలనర్సింహ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 6 నెలలుగా సాగుతున్న విచారణకు భయపడిన నిందితులు గ్రామ పెద్దల వద్ద ఉన్నదంతా చెప్పుకున్నారు. కొడుకుకోడలే హత్య చేశారని నిర్ధరించుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
ఇవీచూడండి: ఆ ఇంటిని పట్టుకున్న డెంగీ భూతం