ETV Bharat / city

మాతృభాష విలువ తెలియని వ్యక్తులు వెంకయ్యను విమర్శిస్తారా..? - జగన్​పై సోమిరెడ్డి విమర్శలు వార్తలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వెళ్లారని... తెలుగు భాష, యాస అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది ఆయనేనని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై సీఎం జగన్ విమర్శలు చేయడం మంచిది కాదని సోమిరెడ్డి హితవు పలికారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
author img

By

Published : Nov 13, 2019, 5:38 PM IST

somireddy fires jagan comments on venkaiah naidu
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను... తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తెలుగు భాష, యాస, ప్రాస, సంస్కృతి, ఉపన్యాసాలంటే ప్రపంచానికి గుర్తుకొచ్చే వ్యక్తిపై... జగన్ విమర్శలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నప్పుడు 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి... ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమంలో చదువుకొని... ఆ స్థాయికి వెళ్లారని కొనియాడారు. ఆయనను చూసి నేర్చుకోవాల్సింది పోయి... విమర్శిస్తారా అని ఆక్షేపించారు. మాతృభాష విలువ తెలియని వ్యక్తులు... వెంకయ్యను విమర్శించడం విడ్డూరంగా ఉందని ట్విట్టర్‌ వేదికగా విమర్శించారు.

ఇవీ చదవండి..

'జేబులు నిండాయి కదా.. ఇప్పటికైనా ఉచితంగా ఇవ్వండి'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.